Salman Khan: ఓటీటీలకు కూడా సెన్సార్‌ ఉండాలి…. సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!

Salman Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ తన పూర్తి సమయాన్ని కేవలం సినిమాలకు మాత్రమే కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం ” కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ” అనే సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓటీటీ ల గురించి సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఇంట్లో ఉన్న ఆడియన్స్ ను ఆకర్షిస్తున్నాయి. కరోనా సమయం నుండి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి.
థియేటర్ లకు వచ్చిన కొన్నిరోజులకే ఓటీటీల్లో సినిమాలు వస్తుండటంతో.. ప్రేక్షకుల కూడా థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యే కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ లేకపోవడం సమస్యగా మారింది.

ఇప్పటికే ఎంతోమంది ఓటీటీలకు సెన్సార్ తప్పనిసరిగా ఉండాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీ కంటెంట్ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్ విషయంలో ఓటీటికి సెన్సార్ ఉండాలి అన్నారు. ప్రస్తుతం ఓటీటీల్లో వచ్చే కంటెంట్ లో వల్గారిటీ చాలా ఎక్కువగా ఉంటోంది. హింస, మితిమీరిన శృంగారం డిజిటల్ కంటెంట్ లో ఎక్కువైపోతుంది.

Salman Khan:ఓటీటీ పై సెన్సార్ దృష్టి పెట్టాలి…

ఇలా ఉండటం వల్ల పిల్లలు చెడుదారులు పడుతన్నారంటూ తల్లి తండ్రులు కూడా ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీ కంటెంట్‌పై తప్పకుండా సెన్సార్‌షిప్‌ ఉండాలని, అప్పుడే శృంగార, అశ్లీల, హింసాత్మక దృశ్యాల్ని అడ్డుకోగలం అన్నారు. ప్రస్తుతం చాలా మంది దర్శకనిర్మాతలు క్లీన్‌ కంటెంట్‌ మీదనే దృష్టి పెడుతున్నారని, అలాంటి కథలే ఎక్కువ మందికి చేరువవుతున్నాయని సల్మాన్‌ఖాన్‌ అభిప్రాయపడ్డారు.