Salman Khan: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ తన పూర్తి సమయాన్ని కేవలం సినిమాలకు మాత్రమే కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం ” కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ” అనే సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఓటీటీ ల గురించి సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఇంట్లో ఉన్న ఆడియన్స్ ను ఆకర్షిస్తున్నాయి. కరోనా సమయం నుండి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి.
థియేటర్ లకు వచ్చిన కొన్నిరోజులకే ఓటీటీల్లో సినిమాలు వస్తుండటంతో.. ప్రేక్షకుల కూడా థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్‌పై సెన్సార్‌షిప్ లేకపోవడం సమస్యగా మారింది.
ఇప్పటికే ఎంతోమంది ఓటీటీలకు సెన్సార్ తప్పనిసరిగా ఉండాలని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీ కంటెంట్ మీద కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్ విషయంలో ఓటీటికి సెన్సార్ ఉండాలి అన్నారు. ప్రస్తుతం ఓటీటీల్లో వచ్చే కంటెంట్ లో వల్గారిటీ చాలా ఎక్కువగా ఉంటోంది. హింస, మితిమీరిన శృంగారం డిజిటల్ కంటెంట్ లో ఎక్కువైపోతుంది.
ఇలా ఉండటం వల్ల పిల్లలు చెడుదారులు పడుతన్నారంటూ తల్లి తండ్రులు కూడా ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీ కంటెంట్‌పై తప్పకుండా సెన్సార్‌షిప్ ఉండాలని, అప్పుడే శృంగార, అశ్లీల, హింసాత్మక దృశ్యాల్ని అడ్డుకోగలం అన్నారు. ప్రస్తుతం చాలా మంది దర్శకనిర్మాతలు క్లీన్ కంటెంట్ మీదనే దృష్టి పెడుతున్నారని, అలాంటి కథలే ఎక్కువ మందికి చేరువవుతున్నాయని సల్మాన్‌ఖాన్ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…