AP Politics: తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ ప్రస్తుతం యువగలం పాదయాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్రలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ పాదయాత్రకు ముందు బాలకృష్ణ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇలా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం పరిశ్రమలు రావడం లేదు… ఉపాధి కల్పన జరగలేదు రాష్ట్రం మొత్తం ల్యాండ్ సాండ్ మైనింగ్ జరుగుతుంది.
ఈ రాష్ట్రంలో జగన్ అనుచరులు వారి కుటుంబీకులు మాత్రమే బ్రతకగలరు సామాన్య ప్రజలు బతకలేని దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి జగన్ ముఖ్యమంత్రి అయితే సైకో పాలన అవుతుందని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వలస వెళ్లిపోవాలని ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక మారిపోతుంది అంటూ బాలకృష్ణ మాట్లాడారు.
జగన్ పనితీరు నచ్చక ఇప్పటికే ఎంతోమంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని వారంత తమ పార్టీతో అటాచ్మెంట్ అవుతున్నారని తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉన్నారని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి పబ్జి ఆడటం తప్ప ఏమీ తెలియదని ప్రస్తుతం ఆయన పార్టీ ఓటమి అంచులలో ఉందనే విషయం జగన్ కి తెలుసు అంటూ బాలకృష్ణ తెలిపారు.వైసిపి అరాచక పాలనను ఎదిరించి ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి కొనసాగుతుందని బాలయ్య వెల్లడించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…