Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా టాలివుడ్లో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా లో బాహుబలి పాత్రలో నటించిన ప్రభాస్ ఆ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటినుండి కేవలం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో మాత్రమే ప్రభాస్ నటిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా గుర్తింపు పొందారు.
అయితే హీరోగా ఇంత గుర్తింపు పొందిన ఒక దర్శకుడి చేతిలో చివాట్లు తిన్నట్లు స్వయంగా వెల్లడించారు. ఇటీవల ఒక షో లో పాల్గొన్న ప్రభాస్ ఈ విషయాన్ని బయటపెట్టారు. బాహుబలి సినిమా కన్నా ముందు రాజమౌళి దర్శకత్వం వహించిన చత్రపతి సినిమాలో ప్రభాస్ నటించాడు. ఈ సినిమాలో ఒక సన్నివేషంలో విలన్ ను చంపిన తర్వాత బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశిస్తూ డైలాగ్ చెప్పాల్సి ఉంది. అయితే ఆ సమయంలో బయట వర్షం పడటం జనం ఎక్కువగా ఉండటం వల్ల ప్రభాస్ డైలాగ్ చెప్పటానికి తడబడినట్లు తెలిపాడు.
ఆ సమయంలో రాజమౌళిని పిలిచి అందరిముందు డైలాగ్ గట్టిగా చెప్పలేను చిన్నగా చెబుతానని చెప్పగానే రాజమౌళి ఒకే చెప్పటంతో ఎవ్వరికీ వినిపించకుండా డైలాగ్ చెప్పగానే రాజమౌళి షాట్ ఓకే చేశాడని ప్రభాస్ వెల్లడించాడు. ఇక అప్పటినుండి సెట్ లో కానీ, బయట కాని జనం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభాస్ డైలాగ్ చెప్పకుండా చిన్నగా చెప్పేవాడినని తెలిపాడు. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఒక డైలాగు ఇలా చిన్నగా చెబితే ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ గారు ప్రభాస్ కి చివాట్లు పెట్టినట్లు వెల్లడించాడు. హీరో అన్న తర్వాత అందరి ముందు ధైర్యంగా డైలాగ్ చెప్పకపోతే ఎలా అంటూ విశ్వనాథ్ గారు చివాట్లు పెట్టినట్లు ప్రభాస్ వెల్లడించాడు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…