Sreekanth: జాన్వీ కపూర్ తండ్రిగా హీరో శ్రీకాంత్.. దేవర నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్!

Sreekanth: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల వరుస విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా  నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. న్యూ ఇయన్ సందర్భంగా ఎన్టీఆర్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ఈనెల 8న ఫస్ట్ గ్లింప్స్ ఇస్తామని కూడా చెప్పారు.

ఇకపోతే ఈ సినిమాలో నటించిన ఒకరు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నటుడు మాట్లాడుతూ సినిమా గురించి కీలక అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించబోతున్నారు అంటూ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పక్కా బ్లాక్ బస్టర్..

ఇలా ఎన్టీఆర్ సినిమా నుంచి ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ భారీగా ఉంటుందని తప్పకుండా ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది అంటూ దేవర నటుడు ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.