Senior Journalist Bhardwaja : చిరు సాంగ్ కాంట్రవెర్సీ… యండమూరి సందేహాలు ఏమిటి… ఆయన తప్పు లేదు… ఆ పోస్ట్ ని షేర్ చేసింది ఎవరంటే… వాల్తేరు వీరయ్య సాంగ్ కాంట్రావెర్సీ మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ కామెంట్స్…!

Senior Journalist Bhardwaja : సోషల్ మీడియా కాలంలో చిన్న విషయం కూడా ఇట్టే వైరల్ అవుతుంది. ఇక పెద్ద హీరో సినిమాలో ఏదైనా వివాదం మొదలయిందా ఇక అంతే ఆ విషయం మీద చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని ఛానెల్స్ లోను ఆ విషయం గురించి చర్చలు, విశ్లేషణలు బయలుదేరుతాయి. అలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని టైటిల్ సాంగ్ లిరిక్స్ మీద చర్చలు జరుగుతున్నాయి. అందులో శివ దూషణ జరిగిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు వివాదం ఎలా మొదలయింది, యండమూరి వీరేంద్రనాథ్ మధ్యలో ఎలా వివాదం లోకి వచ్చారు అన్న విషయాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

శివ దూషణ నిజంగా జరిగిందా…

భరద్వాజ గారు మాట్లాడుతూ వాల్తేరు వీరయ్య సినిమాలో హీరో గురించి చెప్పే ఒక పాటలో వశిస్టుడి లాగా తూఫాన్ వచ్చినా తపస్సు చేయగల ఏ ఎమోషన్స్ కి లోబడకుండా నిలకడగా ఉండేవాడు, అలానే తిమిర నేత్ర త్రినేత్రుడు అంటూ పోల్చడం మీదే అభ్యంతరం మొదలయింది అంటూ తెలిపారు. హీరో కి ఏ ఎమోషన్స్ లేవు, తూఫాన్ వచ్చినా నిలకడగా ఉండి ఆలోచస్తాడు అని వశిస్టుడితో పోల్చడం మీద అభ్యంతరం లేదు కానీ త్రినేత్రుడు అంటే శివుడు అలాంటి శివుడిని తిమిర నేత్రుడు అని పోల్చడం శివ దూషణ అంటున్నారు కొంతమంది. తిమిర నేత్రుడు అంటే చీకటి కన్ను కలిగినవాడు అని అర్థం. ఇక ఈ విషయంలో అందరూ యండమూరి విమర్శించారు అనుకుంటున్నారు. విమర్శించింది యండమూరి కాదు పాటలో ఈ అభ్యంతరాలను తెలిపింది ఊటుకూరి జానకిరావు గారు అంటూ క్లారిటీ ఇచ్చారు భరద్వాజ.

జానకిరావు గారు తన పోస్ట్ లో వేటూరి గారి మరణంతో తెలుగు పాట సాహిత్యం అనే దీపం ఆరిపోయే దశకు వచ్చింది. ఇక సిరివెన్నెల మరణంతో పూర్తిగా ఆరిపోయింది అంటూ విమర్శించేసారు. అలానే అసలు పాటలు రాసిన వ్యక్తికి పురాణాల గురించి అవగాహన ఉందా అంటూ తిమిర త్రినేత్రుడు అంటూ శివ దూషణ చేస్తాడా అంటూ విమర్శించాడు. అయితే ఈ పోస్ట్ ను యండమూరి గారు షేర్ చేస్తూ నాకు జానకి రావు గారి పోస్ట్ అర్థం కాలేదు అంటూ చెప్పి సినిమా కవులను కొంతమందిని అర్ధం అడిగానంటూ వారు చెప్పినది నాకు ఇంకా అర్థం కాలేదు పూర్తిగా అంటూ వివరించారని అంతే కానీ యండమూరి పాటలు గురించి అభ్యంతరం చెప్పలేదని వివరించారు భరద్వాజ గారు. ఇక ఈ ఇష్యూలో పాట రాసిన చంద్ర బోస్ గారు మాట్లాడుతూ వశిస్టుడంత నిలకడ కలిగినవాడు, అలానే శత్రువులను చీకటి లా కామ్మేసే వాడు అన్న అర్థంలో తిమిర అన్న పదం వాడానని యండమూరిగారికి వివరణ ఇచ్చారు అంటూ భరద్వాజ ఈ ఇష్యూ గురించి క్లారిటీ ఇచ్చారు.