Categories: FeaturedMovie News

Mokshagna: మోక్షజ్ఞకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమా…. పవన్ కోసం వచ్చిన మోక్షజ్ఞ!

Mokshagna: బాలయ్య వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక రెండవ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ఈ సీజన్ కి హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ఆహా ప్రసారం చేయనుంది. అదేవిధంగా ఈ సీజన్ క్లైమాక్స్ ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.

ఇక ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కావడంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి కావడంతో ఈ షో కి సంబంధించిన కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. దీంతో ఈ కార్యక్రమం పై మరిన్ని అంచనాలు కూడా పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే ప్రభాస్ షోలో బాలకృష్ణ రామ్ చరణ్ కు ఫోన్ చేసిన విధంగానే పవన్ కళ్యాణ్ షోలో కూడా బాలకృష్ణ రామ్ చరణ్ కి ఫోన్ చేసి మాట్లాడారని సమాచారం. అదేవిధంగా ఈ షో కోసం మధ్యలో డైరెక్టర్ క్రిష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్యతో కలిసి పవన్ తొడ కొట్టారనే వార్తలు వినపడుతున్నాయి.

Mokshagna: పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగిన మోక్షజ్ఞ…

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ షూటింగ్ లాస్ట్ లో మోక్షజ్ఞ వేదిక పైకి వచ్చి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగారని తెలియడంతో మోక్షజ్ఞకు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమా అని అభిమానులు భావిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ రావడాన్ని ఎపిసోడ్ లో బహుశా చూపించకపోవచ్చని తెలుస్తుంది.మోక్షజ్ఞ పవన్ కళ్యాణ్ పై అభిమానంతో వ్యక్తిగతంగా తనతో ఫోటో దిగడానికి వచ్చారు కనుక ఈ సన్నివేశాలు ఈ కార్యక్రమంలో ఉండవని భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago