Senior Journalist Bhardwaja : రాజమౌళి డబ్బులు పెట్టి ఆస్కార్ కొన్నాడా… డబ్బులు పెట్టి ఎవరైనా ఆస్కార్ కొనవచ్చా…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ అవార్డు వచ్చిందనే చర్చ కంటే అవార్డును రాజమౌళి కొన్నాడా అనే విషయం మీద ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఇలాంటి చర్చ పొరుగు రాష్ట్రం వాళ్ళు ఈర్ష్యతో చేసి ఉన్నా ఏమి అనిపించదు కానీ మన తెలుగు వాళ్ళే ఇలాంటి చర్చను జరపడం విడ్డూరంగాను ఒకింత బాధగాను అనిపిస్తుంది. ఆస్కార్ అందుకోవడం ఒక గర్వకారణం అయితే అందుకు ప్రశంశించకపోయినా ఎలా అవార్డు వచ్చింది, ఎంత డబ్బు పెట్టి అవార్డు కొన్నాడు వంటి చర్చలు ఎబ్బెట్టుగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల వాళ్ళు వారలో ఎవరికైనా ఇలా అవార్డు వస్తే ఇలానే కించపరుస్తారా అన్నది ప్రశ్న. ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

ఆస్కార్ అవార్డును కొనవచ్చా…

సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన ఇష్యూ గురించి మాట్లాడుతూ రాజమౌళి పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ అవార్డు వచ్చిందని తెలిపారు. ఈ అవార్డు కోసం 80 కోట్లు ఖర్చు చేసారు అవార్డు కొన్నారు అంటూ వచ్చిన వార్తల గురించి మాట్లాడుతూ అలా ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డులను కొనగలిగితే ఇంతకుముందు ఎంతో మంది అలా అవార్డులను కొనేవారు, ఇండియాలో రాజమౌళి కన్నా డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు కదా అంటూ మాట్లాడారు. అయితే రాజమౌళి డబ్బు ఖర్చు పెట్టిన మాట వాస్తవమే అయినా అది కేవలం ఆర్ఆర్ఆర్ సినిమా టీంను హాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి ఖర్చు పెట్టాడు.

మన ఇండియాలో కూడా భారతరత్న వంటి అవార్డు ఇవ్వాలంటే ముందుగా ఒక వ్యక్తిని అనుకుని ఆ రాష్ట్రం సిఫార్సు చేయాలి, అలా చేసాక అవార్డు రావడానికి ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు కృషి చేసి కేంద్రంతో మాట్లాడి అవార్డు వచ్చేలా చేస్తారు. అదే ఇక్కడ జరిగింది. లాబీయింగ్ చేసి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచ వేదిక మీద ఉంచాడు రాజమౌళి, వాళ్ళ దృష్టిలో ఆ సినిమా పడేలా చేయడానికి కఖర్చు చేసాడు. అందులో సక్సెస్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అన్నది విదేశాలకు తెలుగు సినిమా పాసుపోర్టు వంటిది. తరువాత వచ్చే సినిమాలను ఆస్కార్ పరిశీలిస్తుంది, తన మార్కెట్ ను పెంచుకుంటూనే రాజమౌళి తెలుగు సినిమా మార్కెట్ ను పెంచాడు అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.