Senior Journalist Dheeraj Appaji : శరత్ బాబు ఏకాకి… ఒంటరి జీవితానికి అలవాటు పడ్డారు…రెండు నెలల క్రితం కూడా ఆరోగ్యంగా ఉన్నారు… సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ

Senior Journalist Dheeraj Appaji : విలక్షణ నటుడు విలన్ గాను,హీరోగాను, తండ్రి గాను సహాయక పాత్రల్లో ఇలా ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయి నటించే ఆర్టిస్ట్ అప్పట్లో శరత్ బాబు గారు. రామ రాజ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. ఆముదాల వలసలో జన్మించిన ఆయన చెన్నై కి సినిమాల కోసం వచ్చారు. అలా రామ రాజ్యం, కన్నె మనసులు, పంతులమ్మ, సీతకొక చిలుక,చిలకమ్మ చెప్పింది వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన 1981,88,89 మూడు సార్లు ఉత్తమం సహాయక నటుడుగా నంది పురస్కారం సైతం అందుకున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్ బాబు గారు తుది శ్వాస విడిచారు . ఇక ఆయన రెండు పెళ్లిళ్ళు చేసుకున్న అవి కూడా విఫలం అయ్యాయి. ఇక ఆయన గురించి మరిన్ని వివరాలను జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ వివరించారు.

ఏకాకి… ఒంటరి జీవితం ఇష్టం….

శరత్ బాబు గారు మొదట రమప్రభ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 15 సంవత్సరాలకు ఇద్దరు మస్పర్తల కారణంగా విడిపోయారు. ఇక మరోసారి తమిళ నటిని పెళ్లి చేసుకున్న ఆ బంధం ఎక్కువ కాలం ఉండలేదు. అలా శరత్ బాబు తన అన్న పిల్లలను చూసుకుంటూ వచ్చారు. అయనకంటూ సంతానం లేరు. ఇండస్ట్రీ లో ఎన్నో వేడుకలు, ఎంతో మంది స్నేహితులు ఉన్న కూడా అయన ఎక్కడికి వెళ్లేవారు కాదట. ఒంటరిగా ఉండటానికి బాగా ఇష్టపడే ఆయన ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటూ ఉండేవారంటూ జర్నలిస్ట్ అప్పాజీ తెలిపారు.

తనకు తెలిసిన ఒక పాత్రికేయ మిత్రుడు రెండు నెలలు క్రితం శరత్ బాబుగారి ఇంటర్వ్యూ చేసారని ఆ సమయంలో అయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వయసు 72 సంవత్సరాలు అయినా ఆయన అలా లేరంటూ చెప్పారు అప్పాజీ. చాలా ఆరోగ్యాకరమైన అలవాట్లను కూడా ఆయన అలవరుచుకున్నారు అందువల్ల ఆయన అపుడే మరణిస్తారని ఎవరు అనుకోలేదని చెప్పారు అప్పాజీ.