Senior Journalist Imandhi Ramarao : పొట్టమీద 20 కత్తి పొట్లు… పెద్ద హీరోయిన్లకు పోటీ వస్తుందని… అలనాటి నటి లీలారాణి ని చంపింది ఎవరంటే : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : సినిమా ఇండస్ట్రీలో ఎపుడు ఎవరికి స్టార్ డమ్ వస్తుందో ఎవరు కెరీర్ పడిపోయి మరుగున పడతారో తెలియదు. అలాగే పైకి కనిపించని శత్రువులు వారికి ఉంటారు. అవకాశాల కోసం కష్టపడటం ఒకెత్తయితే సక్సెస్ అయ్యాక దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అయితే కష్టపడి గుర్తింవు తెచ్చుకుని హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో అలనాటి నటి లీలా రాణి ని అత్యంత దారుణంగా చంపేశారు. తాను ఎవరికి పోటీ వస్తుందనే కారణంతో చంపారో ఇప్పటికీ మిస్టరీనే.. ఇక ఆ అలనాటి నటి సినిమా ప్రస్థానం గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

జూనియర్ వాణిశ్రీ గా ఎదుగుతున్న సమయంలో…

లీలా రాణి స్వస్థలం విజయనగరం. తండ్రి నాటకాల కాంట్రాక్టర్ కావడం వల్ల ఆమె కూడా డ్రామా ఆర్టిస్ట్ గా ఎదిగారు. ‘చింతామణి’ నాటకంలో ముఖ్య పాత్రలో నటించారు. అలా పేరు తెచ్చుకున్న లీలా రాణి ఇక సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో మద్రాస్ వెళ్లారు. సినిమాల్లో మొదట చిన్న పాత్రలతో మొదలు పెట్టి ‘జీవన తరంగాలు’ వంటి సినిమాల్లో గుర్తింపు ఉండే పాత్రలో నటించారు. ఇక ఆమె టైటిల్ రోల్ పాత్రలో నటుడు ప్రసాద్ సరసన హీరోయిన్ గా ‘గీత’ అనే సినిమాల్లో నటించింది.

ఎక్కువగా పీసీ రెడ్డి సినిమాల్లో కనిపించిన లీలా రాణి జూనియర్ వాణిశ్రీ గా పేరు తెచ్చుకుంది. హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తాయి అనుకున్న సమయంలో ఆమె హత్య చేయబడింది. పొట్టమీద 20 దాకా కత్తిపోట్లతో దారుణంగా ఆమెను చంపేసారు. హంతకులు ఎవరన్నది చాలా కాలం వరకు మిస్టరీ గానే ఉండేది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక చాలా కాలానికి అసలు లీలా రాణిని పెంచి పెద్ద చేసిన వాళ్ళే హత్య చేసారనే షాకింగ్ న్యూస్ తెలిసింది అంటూ ఇమంది గారు లీలా రాణి గురించి వివరించారు.