Upasana: ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగా కుటుంబం నుంచి రాంచరణ్ మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు పెళ్లి చేసుకుని పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా పిల్లల గురించి ఏ విషయం ఆలోచించకపోవడంతో మెగా అభిమానులు కొంతమేర నిరాశ వ్యక్తం చేశారు. ఇకపోతే రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేయడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇలా మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లల విషయం గురించి గతంలో ఉపాసన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాసన పిల్లల్ని కనడం గురించి మాట్లాడుతూ.. పిల్లల్ని కనడం అంటే 20 ఏళ్ల ప్రాజెక్టు అని ఈమె తెలిపారు.
పిల్లల్ని కనడానికి మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ఈ ప్రపంచంలోకి ఒక ప్రాణిని తీసుకురావడం అనేది చాలా పెద్ద బాధ్యత వారు పుట్టిన తర్వాత వారికి ఏం కావాలి ఏం చేయాలి అనే విషయాలు గురించి ముందుగానే సన్నద్ధం అయిన తర్వాత పిల్లల గురించి ఆలోచించాలని ఇలాంటి విషయాల గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే పిల్లల కోసం ప్లాన్ చేయాలని ఈమె తెలిపారు.
ఈ సందర్భంగా పిల్లలకు కావలసిన అవసరాలన్నింటిని ముందుగానే సమకూర్చి పిల్లలను ప్లాన్ చేసుకోవాలంటూ గతంలో ఉపాసన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే పిల్లలను కనడాన్ని కూడా ఉపాసన ఒక బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ యాంగిల్ లోనే చెప్పారని చెప్పాలి. ఇలా ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…