Senior Journalist Imandhi Ramarao : 60 ఏళ్ల చరిత్ర ను తిరగరాసిన అల్లు అర్జున్… జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు….: సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చి నేడు పుష్ప, పుష్పరాజ్ తగ్గేదేలే అంటు ఏకంగ ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు సొంతం చేసుకున్నాడు బన్నీ. హీరోగా కమర్షియల్ సక్సెస్ లు ఎన్నో చుసినా నటన పరంగా కూడ ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకోవడంతో తెలుగు అభిమానులందరు సంతోషిస్తున్నారు. తాజాగా ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో పుష్ప, త్రిపుల్ ఆర్ సినిమాలతో పాటు ఉప్పెన సినిమా కూడ అవార్డులను అందుకోవడం గర్వించదగ్గ విషయం. ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడారు.

అరవై ఏళ్ల చరిత్ర తిరగరాసిన బన్నీ….

ఇప్పటి వరకు తెలుగు హీరోకు రాని అరుదైనా రికార్డు అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు అందుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు అంటూ ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు. ఇక అదే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ కు అవార్డు రావడం గర్వకారణంగా ఉందంటూ చెప్పారు.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకు ఏకంగా ఐదు అవార్డులు రావడం ఉప్పెన సినిమా ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా నిలవడంతో ఈసారి నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమా మంచి బోణి కొట్టిందనే చెప్పాలి అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా రావడం చాలా ఆనందాన్ని ఇస్తోందని పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప సినిమా క్రేజ్ చూపిందని అటు నార్త్ లోను ఇటు సౌత్ లోను పుష్ప మానియా చాలా రోజులు ఉందని ఇక ఆ సినిమాలో అన్ని పాటలు ఇండియాను ఉపేశాయంటూ చెప్పారు.