Sharwanand: ఆ సినిమా ఫ్లాప్ అవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను.. మూడు నెలలు బయటకు కూడా రాలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత నటీనటులకు హిట్ ఫ్లాప్ సినిమాలు రావడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పుడు చాలామంది ఎంతో డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు.అయితే తాను కూడా అలాంటి డిప్రెషన్ కి గురయ్యానని తాజాగా శర్వానంద్ ఇంటర్వ్యూ ద్వారా తన గత సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాజాగా శర్వానంద్ రీతు వర్మ జంటగా శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం.ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఈ సినిమా కోసం దాదాపు 140 రోజుల పాటు ఎండ, వాన,అని లెక్కచేయకుండా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశాను ఈ సినిమా పక్కా హిట్ అవుతుందన్న నమ్మకం కూడా నాలో పెరిగిపోయింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ కావడంతో ఎంతో డిసప్పాయింట్ అయ్యానని,మూడు నెలల పాటు బయటకు రాకుండా డిప్రెషన్ కి గురయ్యానని ఈ సందర్భంగా శర్వానంద్ వెల్లడించారు.

Sharwanand: ఎండ వానను లెక్కచేయకుండా కష్టపడ్డాను..

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఇలా డిసప్పాయింట్ చేయడంతో నేను ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నానని ఈ సందర్భంగా శర్వానంద్ తన కెరియర్లో డిజాస్టర్ గా నిలిచినటువంటి పడి పడి లేచే మనసు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.ఇదే కాకుండా తన కెరీర్లో మరికొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా విషయంలో మాత్రం తాను చాలా డిసప్పాయింట్ అయ్యానని తెలిపారు.ఒకే ఒక జీవితం సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ ఈయన ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.