Featured

Sadha : ‘నాగ’ సినిమా తరువాత ఎన్టీఆర్ తో అందుకే టచ్ లో లేను : సదా

Sadha : ‘జయం’ సినిమాతో ట్రెడిషనల్ అమ్మాయిగా మంచి మార్కులు కొట్టేసిన అమ్మడు సదా. ఈ బెంగుళూరు అమ్మాయి జయం సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక వరుస ఆఫర్స్ తో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దొంగ దొంగది, నాగ, అపరిచితుడు, ఔనన్నా కాదన్నా వంటి సినిమాల్తో అలరించిన సదా ఆ తరువాత వెండి తెరకు దూరమైంది. చాలా రోజులకు ఒకటి అరా సినిమాలు తీసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఈటీవీలో ఢీ షోకి జడ్జి గా కూడా కొద్ది రోజులు వచ్చిన సదా మళ్ళీ అడ్రెస్ లేదు.

సినిమా వాళ్ళతో టచ్ లో లేను…

జయం సినిమా తరువాత వరుస ఆఫర్స్ తో దూసుకెళ్లిన సదా ఆ తరువాత పెద్ద హీరోలతో కలిసి నటించింది. ఇక అందరితోనూ నటించినా ఇండస్ట్రీలో ఎవరూ తనకంటూ ఫ్రెండ్స్ లేరని సదా చెబుతోంది. తనకు బయట కూడా చాలా తక్కువ మంది మిత్రులు ఉంటారని ఇక ఇండస్ట్రీలో ఎవరూ లేరంటూ చెప్పింది సదా. ఇది నా కెరీర్ కు మైనస్ పాయింట్ అంటూ చెప్పింది. జయం తరువాత నాగ లాంటి సినిమా పెద్ద బ్యానర్ లో ఎన్టీఆర్ తో నటించిన సినిమా తరువాత ఎన్టీఆర్ తో అసలు టచ్ లో లేనని చెప్పారు.

పెద్దగా సినిమా టైములో కూడా మాట్లాడేదాన్ని కాదని చెప్పారు. ఇక సినిమా వరకే పరిచయం అయ్యాక ఎవరితో మాట్లాడక పోవడం వల్లే నాకు ఎక్కువ ఆఫర్స్ రాలేదని అనిపిస్తుంది అంటూ సదా అభిప్రాయపడింది. కొంచెం ఇండస్ట్రీ వాళ్లలో టచ్ ఉంది అంటే సుమంత్ గారితో మాత్రమే అని, అదికూడా పుట్టినరోజు నాడు అలా శుభాకాంక్షలు మెసేజ్ చేసుకోవడం వరకే అంటూ చెప్పింది సదా.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

5 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

5 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

5 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

6 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

6 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

6 hours ago