Shekhar : నిలిచిపోయిన “శేఖర్” సినిమా ప్రదర్శన.. మా మీద కుట్ర చేస్తున్నారంటున్న హీరో రాజశేఖర్..!

Shekhar : కోవిడ్ సమయంలో కరోనా సోకి చావు అంచుల వరకు వెళ్లిన రాజశేఖర్ కోలుకున్నాక నటించిన చిత్రం శేఖర్. ఈ సినిమాకు జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఇక ఈసినిమా రాజశేఖర్ కూతురిగా కూతురు శివాని నటించింది. శేఖర్ సినిమా మలయాళం సినిమా జోసెఫ్ రీమేక్. చాలా ఏళ్ల తరువాత సాయి కుమార్ రాజశేఖర్ కి డబ్బింగ్ అందించారు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. నెమ్మదిగా ఉన్నా సినిమా చూడటానికి బాగుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సినిమా నిలుపుదల ఆదేశాలు ఇచ్చిన సిటీ సివిల్ కోర్ట్…

ఇక సినిమాను అప్పులు చేసి తీశామని రాజశేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. సినిమా ఆడకపోతే మా కుటుంబం రోడ్డునపడుతుందని చెప్పారు. ఇక ఇటీవల ఈ సినిమాకోసం 65 లక్షలు ఇచ్చిన ఫైనాన్సియర్ పరంధామ రెడ్డి డబ్బు చెల్లించక పోవడంతో సిటీ సివిల్ కోర్ట్ ను ఆశ్రయించారు. ఆదివారం సాయంత్రం నాలుగున్నర లోగా సెక్యూరిటీ డిపాజిట్‌గా కోర్టులో సమర్పించాలని కోరారు. అలా డిపాజిట్ చేయని పక్షంలో సినిమాపై హక్కుల్ని తనకే ఇవ్వాలన్నది పరంధామరెడ్డి పిటిషన్‌ సారాంశం. ఆమేరకే ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు వచ్చాయి. దాంతో సినిమాను అన్ని థియేటర్లలోను ప్రదర్శన నిలిపివేశారు.

మా కుటుంబంపై కుట్ర చేస్తున్నారు….

చాలా కష్టాలు పడి శేఖర్ సినిమాను తీశామని కానీ కొంతమంది కుట్ర చేసి సినిమాను అడ్డుకుంటున్నారని ఈ సమయంలో అసలు ఏమి మాట్లాడాలో అర్థంకావడం లేదని చెప్పారు. సినిమానే మా జీవితమని శేఖర్ సినిమా తనకు హోప్ లాంటిదని వాఖ్యణించారు. ఈ సినిమాకు దక్కాల్సిన ప్రాధాన్యం ఖచ్చితంగా దక్కుతుందని భావిస్తున్నట్లు ట్వీట్ ద్వారా కోర్ట్ ఉత్తర్వుల గురించి స్పందించాడు. సినిమా మంచి టాక్ తో వసూళ్లు రాబడుతున్న సమయంలో ఇలా జరగడం శేఖర్ సినిమాకు నష్టమే.