Big Boss OTT : దేశవ్యాప్తంగా ప్రసారమవుతున్న బుల్లితెర ప్రోగ్రాం లలో టాప్ రేటెడ్ ప్రోగ్రాం గా కొనసాగుతోంది బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగులో కూడా మంచి ఆదరణ పొందింది. ప్రతిరోజు ప్రసారం అయ్యే ఒక గంట ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు. అందుకే మరో అడుగు ముందుకు వేసి బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించారు. హౌస్ లోని సభ్యులు ఏం చేస్తున్నారో 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ అభిమానులకు వినోదాన్ని పంచారు. ఈ ఓటీటీ మొదటి సీజన్‌లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి మొత్తం 18 మంది సభ్యులు పాల్గొన్నారు. వీరిలో ఫినాలేకు అనిల్, అరియానా, అఖిల్, బిందు, శివ, మిత్ర, బాబా చేరుకున్నారు.
అయితే ఈ సారి బిగ్ బాస్ మొత్తం గొడవల తోనే ఎక్కువగా సాగింది. అయితే ఈ బిగ్ బాస్ లో ప్రత్యేకత ఏంటంటే మొదటిసారి అమ్మాయి విన్నర్ గా నిలిచారు. శనివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో నాగార్జున, బిందు మాధవిని విన్నర్‌గా ప్రకటించాడు. ఇక సెకండ్ ప్లేస్ లో అఖిల్ సార్థక్ నిలిచాడు. యాంకర్ శివ సెకండ్ రన్నరప్ నిలిచాడు. వీటిని ముందుగానే అంచనా వేసిన అరియానా రూ.10 లక్షల సూట్‌కేస్ తీసుకొని రేసు నుంచి తప్పుకుంది.
బిందు మాధవి ఎన్ని లక్షలు సొంతం చేసుకుంది…..
బిగ్ బాస్ విన్నర్ అయిన బిందు స్టేజీపై భావోద్వేగానికి లోనై ఉక్కిరిబిక్కిరి అయింది. తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఇక్కడ అవకాశలు లేక కోలీవుడ్ వెళ్లిన సంగతి తెలిసిందే. కొందరికి కొన్ని రోజులు కష్టపడితే సక్సెస్ వస్తే, మరికొంతమందికి ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే కానీ విజయం రాదు. అలా ఆలస్యంగా విజయాన్ని సొంతం చేసుకొనే లేట్ బ్లూమర్స్‌కు నా గెలుపు అంకితం. నేను కూడా ఒక లేట్ బ్లూమర్‌నే, అని చెప్తూ స్టేజ్ మీదనే ఎమోషనల్ అయ్యింది. అయితే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి ప్రైజ్ మనీ గా రూ.40 లక్షలను సొంతం చేసుకుంది. మొత్తం 50 లక్షలు రావ్వాల్సి ఉండగా అరియనా 10 లక్షలు తీసుకోవడం తో ప్రైజ్ మనీ తగ్గించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…