దాసరిని తక్కువ అంచనా వేసి ఓ బ్లాక్ బాస్టర్ సినిమాను వదులుకున్న శోభన్ బాబు..

లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా ‘తాత మనవడు’ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని కె. రాఘవ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఈ చిత్రం దాసరికి.. రాఘవకు తొలి సినిమా. 1973లో వచ్చిన ఈ సినిమాలో టైటిల్ రోల్స్‌ను ఎస్వీ రంగారావు, రాజబాబు పోషించారు. అయితే ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇక్కడ రాజబాబు క్యారెక్టర్‌ను శోభన్‌బాబు చేయాల్సి ఉంది.

కానీ.. ఆ పాత్రను రాఘవ ఆఫర్ చేసినప్పుడు శోభన్‌బాబు చెయ్యనని చెప్పారంట. డైరెక్టర్ కొత్తవాడు కావడంతో సినిమాను వదులుకున్నాడంట. అంతేకాకుండా తనతో ఎక్స్‌పెరిమెంట్ చేయొద్దని కూడా అన్నారంట. మరో సినిమాను చేద్దాంలే అని ఆ సినిమా నుంచి తప్పించుకున్నాడంట. సినిమా పెద్ద హిట్ కావడంతో దాసరిని తక్కువ అంచనా వేసినందకు శోభన్ బాబు అప్పట్లో బాధపడ్డాడు.

ఆ తరువాత నుంచి దాసరి నుంచి ఏ ఆఫర్ వచ్చినా ఎప్పుడూ వెంటనే కాదని చెప్పలేదంట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘బలిపీఠం’ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఆ తరువాత వచ్చిన ‘గోరింటాకు’ మరింత హిట్‌ తీసుకొచ్చింది.

ఆ తర్వాత వీరిద్దరి మధ్య అభిమన్యుడు, దీపారాధన, కృష్ణార్జునులు, స్వయంవరం, ధర్మపీఠం దద్దరిల్లింది వంటి చిత్రాలు వచ్చాయి. అప్పటి నుంచి ఏ సినిమాను కాదని అనకుండా ఎన్నో సినిమాలను చేశారు. ఇద్దరు ఒకరినొకరు “బావా బావా” అనుకునేంత సన్నిహితత్వంగా ఉండేవారు. వాళ్లిద్దరు సెట్ లో ఉంటే ఎంతో సరదాగా ఉండేవారు.