మొబైల్ ఫోన్లు వాడేవాళ్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న చార్జీలు..?

దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. కొందరు డేటా కోసం, ఇతర కారణాల వల్ల ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను వినియోగిస్తూ ఉండటంతో టెలీకం కంపెనీలకు లాభం చేకూరుతోంది.

అయితే టెలీకాం కంపెనీలు మొబైల్ ఫోన్ల వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. జియో రాకతో టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కస్టమర్లకు కాల్స్ ఛార్జీలు, డేటా ఛార్జీలు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. అయితే మొదట్లో తక్కువ ధరలకే సర్వీసులు అందించిన జియో తర్వాత కాలంలో కాల్, డేటా ఛార్జీలను పెంచింది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు కంపెనీలు త్వరలోనే మరోసారి ఛార్జీలను పెంచనున్నాయి.

మొబైల్ ఫోన్లు వినియోగించే కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. 2021 జనవరి నెల నుంచి టారిఫ్ చార్జీలు 15 నుంకి 20 శాం పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. జియో మినహా మిగతా కంపెనీలన్నీ పెంచవచ్చని..అయితే జియో టారిఫ్ ధరల పెంపు విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

గతేడాది డిసెంబర్ నెలలో మొబైల్ కంపెనీలు టారిఫ్ చార్జీలను భారీగా పెంచాయి. వొడాఫోన్ ఐడియా, ఎయిర్ ‌టెల్ కంపెనీలు ఇప్పటికే ధరల పెంపు ఉండవచ్చని సంకేతాలు ఇచ్చాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఛార్జీల పెంపు అమలైతే వినియోగదారులు తీవంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.