మావో… ఓయ్.!! మావో.. ఓయ్.. పారిపోతున్నాది ఎవరేటి.. ఎళ్ళిపోతున్నాది.. ఎవరేటి అమెరికా అమ్మాయిరా.. మావో పారిపోతున్నాదిరా మావ..!! అనే పాట 20 సంవత్సరాలు గడిచిన ఇంకా ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది. హీరో ఉదయ్ కిరణ్, హీరోయిన్ రీమాసేన్ లను ఉద్దేశించి హీరో స్నేహితులు రీమాసేన్ ను ఆటపట్టిస్తూ పాడిన పాట ఆ రోజుల్లో పాపులర్ అయ్యింది. చిత్రం సినిమాతోనే రీమాసేన్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
1981లో పశ్చిమ బెంగాల్ కోల్ కత్త లో రీమాసేన్ జన్మించింది. థామస్ గర్ల్స్ స్కూల్ లో పదవ తరగతి వరకు విద్యను అభ్యసించింది. ఆ తర్వాత రీమాసేన్ కుటుంబం ముంబై కి తరలివెళ్లింది. అక్కడ మోడలింగ్ లో రానిస్తున్నప్పుడు. బెంగాలీలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఆమె హిందీలో నటించిన హమ్ గయే ఆప్కే చిత్రంలో నటించింది. ఆ సినిమా పరాజయం పొందడంతో రీమాసేన్ ఎక్కువగా దక్షిణాది చిత్రాల వైపే మొగ్గు చూపడం జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో రామోజీరావు నిర్మాణ సారథ్యంలో దర్శకుడు తేజ నూతన నటీనటులతో చిత్రం సినిమా తీయడానికి సిద్ధమయ్యారు. ఆ క్రమంలో హీరోగా ఉదయ్ కిరణ్ ను తీసుకోగా హీరోయిన్ గా రీమాసేన్ తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు నిర్మాతగా ఆదిత్య దర్శకత్వంలో మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా నటించారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత రీమాసేన్ నాగార్జునతో బావ నచ్చాడు. చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ క్రమంలో మెగాస్టార్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన అంజి చిత్రంలో ఒక్క పాటలో రీమాసేన్ కనిపించారు. ఆ తర్వాత నీతో వస్తా మూవీలో కనిపించారు. తెలుగు చిత్రాల్లో బిజీ అవుతున్న సమయంలోనే రీమాసేన్ తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు చిత్రాలతో పాటు “మిన్నలే” అనే తమిళ చిత్రంలో నటించింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆమె తమిళ సినిమాలతో బిజీ కావడం జరిగింది. అలాగే రీమాసేన్ నటించిన వల్లవన్ అనే తమిళ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కన్నడ చిత్రాల్లో నటించి, 2012లో ముంబై పారిశ్రామికవేత్త అయిన కరణ్ సింగ్ ను వివాహం చేసుకుంది. 2013లో రుద్రవీర్ కు జన్మనిచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…