కరోనా, లాక్ డౌన్ తర్వాత దేశంలో చాలామంది ప్రజారవాణా కంటే సొంత వాహనాలలో ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రస్తుతం బీఎస్6 వాహనాలను మాత్రమే కేంద్రం నిబంధనల ప్రకారం డీలర్లు అమ్ముతుండటంతో గతంతో పోలిస్తే వాహనాల ధరలు భారీగా పెరిగాయి. దీంతో కంపెనీలు వాహనదారులను ఆకర్షించడానికి పలు స్కీంలను ప్రవేశపెడుతున్నా కొత్త బైక్ కొనాలంటే లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది
అయితే పలు వెబ్ సైట్లు తక్కువ మొత్తంతో బైక్ కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తున్నాయి. షాపింగ్ సైట్ డ్రూమ్ droom బజాజ్ పల్సర్, బజాజ్ డిస్కవర్ సెకండ్ హ్యాండ్ బైక్స్ ను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. 2006కు చెందిన బజాజ్ పల్సర్ 150 సీసీ బైక్ ధర ఈ వెబ్ సైట్ లో కేవలం 10,000 రూపాయలుగా ఉంది. 2010 సంవత్సరానికి చెందిన బజాజ్ డిస్కవర్ 100సీసీ బైక్ 10,600 రూపాయలకే అందుబాటులో ఉంది.
అయితే బైక్ ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంటే వెహికిల్ కండీషన్ ను పూర్తిగా తెలుసుకుంటే మంచిది. బైక్ తక్కువ ధరకే దొరుకుతుందని కొనుగోలు చేస్తే మాత్రం తరువాత కాలంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంతే కాక బైక్ కొనుగోలు చేయడానికి ఆఫ్ లైన్ తో పోలిస్తే ఆన్ లైన్ లోనే లావాదేవీలు జరపడం మంచిది. అయితే వెహికిల్ రేట్లు ప్లేస్ ను బట్టి మారే అవకాశం ఉంటుంది.
సెకండ్ హ్యాండ్ బైక్ లను కొనుగోలు చేసినా ఆ తరువాత వాటికి కొత్త బైక్ లతో పోలిస్తే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల సెకండ్ హ్యాండ్ బైక్ లను కొనుగోలు చేసే సమయంలో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…