బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందా…!

బుల్లితెర ప్రసారమయ్యే రియాలిటీ షోలో బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ఈక్రమంలోనే తెలుగు మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం అప్పట్లో అధిక రేటింగ్స్ సంపాదించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అలాగే మొదటి సీజన్ విజయవంతం కావడంతో రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా కొనసాగీ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించి ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకుంది.

ఇక సీజన్ 3 నుంచి బిగ్ బాస్ కార్యక్రమానికి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన అటువంటి సీజన్-3, 4 ఎంతో విజయవంతమయ్యాయి అత్యధిక రేటింగ్స్ ను సాధించాయి. ఇలా నాలుగవ సీజన్ ముగిసిన తర్వాత ప్రేక్షకులు ఐదవ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

ఇలా ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభమయింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీజన్ ఫైవ్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడమే కాకుండా ఒకేసారి 19 మందిని హౌస్ లోకి పంపించారు. సీజన్ ఫైవ్ గత సీజన్లతో పోలిస్తే ప్రేక్షకులను మరింత ఎంటర్ టైన్ చేయబోతున్నారని చెప్పినప్పటికీ ఈ సీజన్ మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరుస్తోందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో ప్రేక్షకులను సందడి చేయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే రేటింగ్స్ కూడా అమాంతం పడిపోయాయి. ఇక వారాంతంలో నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడినప్పటికీ వారిని అడగాల్సిన ప్రశ్నలు తప్ప ఇతర ప్రశ్నలు వేస్తూ అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు.ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ప్రేక్షకులకు మాత్రం ఎలాంటి కిక్ ఇవ్వలేదని ఈ కార్యక్రమం పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.మరి మిగతా వారాలలో అయినా బిగ్ బాస్ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తారో లేకపోతే ఇలాగే కొనసాగుతుందో తెలియాల్సి ఉంది.