ఒకప్పుడు క్లాసికల్ డాన్సర్ లుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చల్లా సిస్టర్స్ గురించి ఈ తరం వారికి తెలియనప్పటికీ అప్పట్లో వీరు ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా చల్లా సిస్టర్ గా పేరు సంపాదించుకున్న వారిలో జయలలిత ఒకరు. చూడగానే ఆకట్టుకునే అందం ఉన్న జయలలితకి కాలం కలిసి రాక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేక కేవలం వ్యాంప్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు.
ఇలా ఎన్నో సినిమాల్లో వ్యాంప్ ఆర్టిస్టుగా చేసిన ఈమె ఆ తరువాత బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా సందడి చేశారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తన వ్యక్తిగత జీవితంలో ఒక మలయాళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న విషయం చాలా మందికి తెలియదు. ఈమె డైరెక్టర్ వినోద్ అనే వ్యక్తిని ఏడు సంవత్సరాల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పలు కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.
జయలలిత సినిమాలలో నటించే సమయంలో ఆమెకు తెలియకుండా తన తండ్రి జయదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి, డైరెక్టర్ క్రాస్ బెల్ట్ మనీ చిత్రానికి ఓకే డేట్స్ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలియక జయలలిత వినోద్ తండ్రి జయదేవన్ సినిమా షూటింగ్లో పాల్గొనడం అదే సమయంలో డైరెక్టర్ క్రాస్ బెల్ట్ మనీ మనుషులు వచ్చి ఆమెతో గొడవకు దిగారు. మా సినిమాకు డేట్స్ ఇచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నావ్ అంటూ ఆమెతో గొడవ పెట్టుకున్నారు. అయితే ఆ సమయంలో ఏం చేయాలో తెలియని జయలలిత కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ సమయంలో వినోద ఒక హీరోగా ఎంట్రీ ఇచ్చి వారి నుంచి ఆమెను కాపాడారు. ఇలా తనని కాపాడటంతో జయలలిత అతనితో ప్రేమలో పడింది. అయితే అతడితో చాల జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచించినప్పటికీ ఈమె వారి విషయాలను పట్టించుకోకుండా తన ప్రేమలో మునిగిపోయి ఎన్నో అద్భుతమైన సినిమా అవకాశాలను కూడా వదులుకొని ఏడేళ్ల ప్రేమ తర్వాత వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వినోద్ అని ఎన్నో చిత్రహింసలకు గురి చేయడంతో విడాకులు తీసుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…