టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే ఇందులో సుబ్బరాజు,వెన్నెల కిషోర్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లో 27వ సినిమా గా రాబోతున్న ఈ సర్కారు వారి పాట సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్14 రీల్స్ ప్లస్ జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమా అనంతరం మూవీ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ మొదలు కానున్న విషయం కూడా తెలిసిందే. ఇక ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేయగా సెకండ్ హీరోయిన్ కోసం సంబంధించి ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇక ఇందులో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపికయింది అని సినీవర్గాల్లో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈమె రవితేజతో కలిసి కిలాడి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీనాక్షి చౌదరికి కొత్త కొత్త ఆఫర్లు వస్తున్నాయి. మీనాక్షి చౌదరి మహేష్ బాబు నటించిన సినిమాలు నటిస్తుందా లేదా అన్న విషయం ఇంక అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం మీనాక్షి చౌదరి ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తోంది అంటూ వార్తలు వినిపించాయి.
మీనాక్షి చౌదరి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే ఆమె జాతకమే మారిపోయే చాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మహేష్ బాబు, ప్రభాస్ నటిస్తున్న సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాలో నటించడం వల్ల మీనాక్షి చౌదరికి ఇతర భాషలలో కూడా సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ఇక త్వరలో త్రివిక్రమ్ మహేష్ కాంబోలో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…