ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆధార్ చూపిస్తే.. కరోనా టీకా !

ఆంధ్రప్రదేశ్ : దేశంలో రెండవ దశ కరోనా టీకాలు ప్రారంభమయ్యాయి.. మొదటి దశ టీకా విజయవంతమైన విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ మార్చి ఒకటిన ప్రారంభమైంది. తొలి టీకాను ప్రధాని మోదీ వేయించుకున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఇక పై ఆధర్ కార్డు చూపిస్తే చాలు కరోనా టీకా వేస్తారని ఏపి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. ఎంపిక చేసిన 20 దీర్గకాళిక వ్యాధులకు సంబంధించిన మందుల చీటీ, రక్త పరీక్ష రిపోర్టు, ఇతర ఆధారాలు ఏవి చూపించినా పంపిణీ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తారని పేర్కొన్నారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ లేకున్నా పర్వాలేదు.. లబ్దిదారులు సరైన ఆధారాలు చూపించి అక్కడికక్కడే వివరాలు నమోదు చేసి టీకా వేస్తామని తెలిపారు.