Jr NTR: సింహాద్రి సినిమా నా సినీ కెరియర్ ను నాశనం చేసింది.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

Jr NTR: నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఇలా ఎన్టీఆర్ తన కెరియర్లో దూసుకుపోతున్న సమయంలో తనకు సంబంధించిన ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jr NTR: సింహాద్రి సినిమా నా సినీ కెరియర్ ను నాశనం చేసింది.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరియర్ లో ఇలా ఉండటానికి గల కారణం రాజమౌళి అని ఎన్నోసార్లు తెలియజేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ విధంగా కెరియర్ మొదట్లోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇండస్ట్రీలో దూసుకుపోయారు. ఈ విధంగా రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, సింహాద్రి, ప్రస్తుతం RRR సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి.

Jr NTR: సింహాద్రి సినిమా నా సినీ కెరియర్ ను నాశనం చేసింది.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్!

ఇకపోతే ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన హీరోకి తరువాత వరుస ఫ్లాప్స్ వస్తాయని టాక్. అయితే రాజమౌళి తన సినిమాలో ఆ హీరోని చాలా హై లెవెల్ లో చూపిస్తారు.ఇక ఆ హీరో తరువాత సినిమాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని ప్రేక్షకులు భావిస్తారు. అయితే ఆ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక ఫ్లాప్ టాక్ సంపాదించుకుంటాయి.

ఎన్టీఆర్ పనైపోయింది…

ఈ విధంగా ఎన్టీఆర్ కెరియర్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ తన సినీ కెరీయర్ ను నాశనం చేసిందని గతంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సింహాద్రి సినిమా తనను హీరోగా ఎంత ఎత్తులో నిలబెట్టిందో అదే స్థాయిలో కిందికి వస్తుందని ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ సినిమా తరువాత మూడేళ్లు వరుస ఫ్లాప్ చిత్రాలు రావడంతో ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పని అయిపోయిందని చాలా మంది భావించారు.అదే సమయంలోనే రాజమౌళి యమదొంగ సినిమాతో నా ముందుకు వచ్చి తనని బరువు తగ్గాలని చెప్పారు. అలా నాలుగు నెలలు కష్టపడి ఎంతో బరువు తగ్గానని ఆ తర్వాత యమదొంగ సినిమా చేయడం తిరిగి ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ కొట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ విధంగా ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నాలుగు సినిమాలు తెరకెక్కేగ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి.