John Abraham: డబ్బు కోసం నేను వాళ్ళలా తెలుగు సినిమాలలో నటించను… సౌత్ సినిమాలపై జాన్ అబ్రహం షాకింగ్ కామెంట్స్!
John Abraham: బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాల సత్తా ఏంటో దేశవ్యాప్తంగా తెలిసిపోయింది.ఈ క్రమంలోనే తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాలు అంటే తప్పనిసరిగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో నటీనటులు నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన RRR సినిమా మరోసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీ సినిమాలు కూడా సాధించలేని రికార్డులను తెలుగు సినిమాలు సొంతం చేసుకోవడంతో కొందరు తెలుగు సినిమాల పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం కూడా తెలుగు సినిమాల పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జాన్ అబ్రహం నేడు ఎటాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తెలుగు సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సలార్ సినిమాలో మీరు నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి,ఇందులో నిజం ఎంత ఉందని యాంకర్ ఇతనిని ప్రశ్నించగా.. జాన్ అబ్రహం మాట్లాడుతూ తాను హిందీ హీరోనని తను కేవలం హిందీ సినిమాలలో మాత్రమే నటిస్తానని తెలిపారు.
నేను ఎప్పటికీ ప్రాంతీయ సినిమాలలో నటించను కేవలం హిందీ చిత్రాలలో మాత్రమే నటిస్తాను. డబ్బు కోసం అందరి హీరోల మాదిరిగా తెలుగు సినిమాల్లో నటించనని జాన్ అబ్రహం తెలియచేయడంతో ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దూమారం రేపుతున్నాయి.ఇక ఈ విషయంపై సౌత్ ఇండస్ట్రీ సినీ ప్రేమికులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…