Rana -Miheeka: త్వరలోనే తండ్రి కాబోతున్న రానా… ప్రెగ్నెన్సీ పై స్పందించిన మిహీక?
Rana -Miheeka: లీడర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దగ్గుబాటి వారసుడు రానా గురించి అందరికీ సుపరిచితమే. నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా కరోనా మొదటి లాక్ డౌన్ సమయంలో మిహీక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో నిరాడంబరంగా జరిగింది.
ఇక వీరి పెళ్లి జరిగి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ వీరికి సంబంధించి ఎలాంటి శుభవార్త ఇప్పటివరకు చెప్పలేదు.అయితే తాజాగా రానా తండ్రి కాబోతున్నారు అంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడంతో ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మిహీక తనకు సంబంధించిన ఫోటోలను, విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఒక పెళ్లి వేడుకకు వెళ్లిన ఈ జంట వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో మిహీక కాస్త బొద్దుగా కనిపించడంతో ఎంతో మంది నెటిజన్లు మీరు ప్రెగ్నెంటా? అంటూ సందేహాలు వ్యక్తపరిచారు.
ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెంటనే మిహీక తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. మీరు ప్రెగ్నెంటా అని ఒక నెటిజన్ తన అని ప్రశ్నించగా వెంటనే ఈమె సమాధానం చెబుతూ… నో..నో పెళ్లి తర్వాత కాస్త బరువు పెరగడంతో బొద్దుగా మారానని, ప్రస్తుతానికి ఎలాంటి గుడ్ న్యూస్ లేదని ఆమె తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…