Simham Navvindi: సింహం నవ్వింది సినిమాకు 40 ఏళ్లు పూర్తి.. అందుకే ఫ్లాప్ అయిందంటూ బాలయ్య సెటైర్స్?

Simham Navvindi: నందమూరి బాలకృష్ణ ఎక్కువగా పూజించే దేవుళ్ళలో లక్ష్మీనరసింహస్వామి ఒకరు. ఈయన లక్ష్మీనరసింహస్వామికి పెద్ద భక్తుడు అనే విషయం మనకు తెలిసిందే. అందుకే ఎక్కువగా ఈయన సినిమాలలో సింహ అనే పేరు రావడానికి ఈయన సెంటిమెంట్ గా భావిస్తూ ఇలాంటి టైటిల్స్ రావడానికి లేదంటే సినిమాలలో సింహం డైలాగులు ఉండడానికి బాలయ్య ఇష్టపడుతుంటారు .

ఈ క్రమంలోనే బాలకృష్ణ నటించిన సినిమాలలో సింహ అనే టైటిల్ ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. బొబ్బిలి సింహం, సమరసింహ రెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహ, జై సింహా, సింహ, వీర సింహారెడ్డి వంటి సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించాయి. అయితే ఈ నరసింహ అని టైటిల్ పెట్టుకున్నటువంటి సినిమాలు కూడా రెండు ఫ్లాప్ గా నిలబడ్డాయి.

ఇలా సింహ టైటిల్ తో వచ్చే ప్లాప్ అందుకున్న సినిమాలలో సీమ సింహం ఒకటి కాగా 1983 మార్చి మూడవ తేదీ విడుదలైనటువంటి సింహం నవ్వింది సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించగా, డి యోగానంద్ దర్శకుడిగా వ్యవహరించారు. ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తాజాగా బాలయ్య ఈ సినిమా గురించి సెటైర్లు వేయడంతో ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.


Simham Navvindi: సింహం నవ్వడం ఏంటయ్యా…

ఈ సందర్భంగా గత కొద్ది రోజుల క్రితం అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీరిలీజ్ వేడుకకు బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ సరదాగా బాలయ్యతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా సింహం నవ్వింది సినిమా గురించి టాపిక్ రావడంతో సింహం నవ్వడం ఏంటయ్యా… అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ బాలయ్య తన సినిమా గురించి తానే సెటైర్ వేసుకున్నారు.ఇకపోతే ఈ సినిమాలో నందమూరి తారకరామారావు మొదటి హీరోగా నటించిన బాలయ్య సెకండ్ హీరోగా నటించారు.