‘పెళ్లి తర్వాత అబ్బాయి నటించొచ్చు.. కానీ అమ్మాయి నటిస్తే తప్పా?’ అంటూ సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో మీటు ఉద్యమం ద్వారా బాగా పాపులర్ అయిన ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు సమాజంలో స్త్రీలపై జరిగే దాడుల గురించి స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా చిన్మయి స్పందిస్తూ ఇండస్ట్రీలో.. పెళ్లయిన తర్వాత అమ్మాయిలు నటించకూడదనే అంశం గురించి చర్చించారు. నా కుటుంబంలో ఒక వ్యక్తి పెళ్లి తర్వాత అమ్మాయిలు సినిమాలలో ఎందుకు నటించకూడదో వివరించారు. అసలు పెళ్లి తర్వాత అమ్మాయిలు సినిమాల్లో నటిస్తే తప్పేంటని? ఈ సందర్భంగా ఈమె ప్రశ్నించారు.

పెళ్లి తర్వాత అబ్బాయిలు ఇండస్ట్రీలో సినిమాలలో నటించవచ్చు.. కానీ అమ్మాయిలు నటించకూడదా? ఇలా వచ్చే ఆలోచనలకు గల కారణం ఏంటో ఆలోచించండని తెలిపారు. ఒక అమ్మాయి పెళ్లి కాకముందు ఎన్నో కలలు కంటుంది పెళ్లి తర్వాత ఆ కలలను తన శరీరాన్ని తన గర్భాన్ని కూడా ఒక అబ్బాయికి అంకితం చేయాలనే భావనలోనే ఇది పుట్టుకొచ్చిందని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రపంచంలోనే ముగ్గురు హీరోయిన్లు పెళ్లి తర్వాత అమ్మాయిలు సినిమాల్లో నటించకూడదనే సరిహద్దు రేఖను బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనే, టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, ఇజ్రాయిల్ నటి గాల్ గాల్ గాడోట్ ఖండించారని ఈ సందర్భంగా చిన్మయి తెలిపారు. నిజానికి ఇలాంటి ఆలోచనలు అప్పట్లో లేవు అప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉంటే మహానటి సావిత్రి వంటి వారు మనకు పరిచయం అయ్యే వారు కాదని, అప్పట్లో ఈ విధమైనటువంటి ఆలోచనలు లేవు కనుక పెళ్లయిన తర్వాత కూడా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగిందని ఈ సందర్భంగా చిన్మయి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.