ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే.. అది అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల విషయం అని చెప్పవచ్చు. గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం స్పందించకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు వీరిద్దరూ కలిసి ఉండాలని విడిపోకూడదని కోరుకున్నారు. తాజాగా సమంత చైతన్యల విడాకుల విషయంపై కాంట్రవర్సి బ్యూటీ శ్రీ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ…టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బ్యూటిఫుల్ కపుల్స్ సమంత నాగచైతన్య జంటను ఎంతో మంది ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఇలా విడాకులు తీసుకొని విడిపోకూడదని ఆమె కోరుకున్నారు.
తమిళనాడులో చాలా మంది ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ లో మాట్లాడగా సమంత పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని..సమంత ఏంటి అంత పెద్ద ఇంటికి కోడలు గా ఉండి ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఏంటనీ చాలామంది అనుకుంటున్నారని ఈ సందర్భంగా శ్రీరెడ్డి తెలియజేశారు. పెళ్లి తర్వాత సమంత డ్రెస్సింగ్ విషయంలో చాలా మార్పులు జరిగాయని మనం ఎంత స్టార్ సెలబ్రిటీ అయినా మనం ఇండియాలోనే ఉన్నాము. ఇండియాలో మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి తన డ్రెస్సింగ్ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలియజేశారు.
సంసారం అన్నాక ఎన్నో గొడవలు, పోట్లాటలు ఉంటాయి. అయితే వాటిని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో అన్యోన్యంగా ఉండవచ్చని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తెలియజేశారు. ఇండియాలో ఆడవాళ్లకు కొద్దిగా సహనం ఎక్కువ అంటారు అదే సహనంతో మీ సమస్యను పరిష్కరించుకొని నాగచైతన్య అన్నయ్య కానీ సమంత వదిన కానీ సర్దుకుపోతే మీ జీవితం ఎంతో బాగుంటుంది. మీరిద్దరూ కలిసి ఉండి ఎందరికో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా శ్రీ రెడ్డి సమంత నాగచైతన్య విడాకుల విషయం గురించి స్పందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…