Categories: FeaturedGeneral News

ఓ వ్యక్తిపై ఎస్సై వీరంగం.. కాలి బూటుతో తన్ని.. వీడియో వైరల్..

మన భారతదేశంలోనే తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా చెప్పుకుంటారు. కానీ క్షేత్రస్తాయిలో చూస్తే మాత్రం అలా ఉండటం లేదు. ప్రజలకు ఒక సర్వెంట్ గా ఉండాల్సిన పోలీసు ఆఫీసర్ అతడి బూటుతో మొఖం తన్నాడు. తర్వాత తీవ్ర పదజాలంతో దూషించాడు. అంతే కాకుండా అక్కడ ఈ వీడియోను తీస్తున్న అతడిని మందలించినట్లు సమాచారం. ప్రజల కోసమే తాము ఉంటున్నామని.. ప్రజలతో కలిసి పని చేస్తున్నామని చెప్పి.. ప్రజలనే ఇలా కాలితో తన్నుతూ మేము ఇలానే ఉంటామనేది.. ఈ ఘటన తెలియజేస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లాలో కర్నూలుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిని రాజోలి ఎస్సై లెనిన్ బాబు కాలి బూటుతో తన్నాడు. రాజోలి మండల కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న ఓ మద్యం దుకాణం వద్దకు మద్యం బాబులు విపరీతంగా వస్తుంటారు.

అక్కడ ఈ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఈ తనిఖీలో భాగంగా కర్నూలుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి అక్కడ మద్యం షాప్ వద్ద మద్యం సేవించడం పోలీసులు చూశారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగడాన్ని చూసిన పోలీసులు బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అతడిని అందులో ఊదమని అడగ్గా.. ఊదలేదు. కనీసం దగ్గరకు రాలేదని ఎస్సై తెలిపాడు. అయితే కోపంతో అతడిని బూటుతో మొఖంపై తన్ని.. అసభ్యకర పదజాలంతో దూషించాడు.

ఆ బూటుతో తన్నడంతోనే అక్కడే పడిపోయాడు. దీనిపై వివరణ కోరగా.. తమతో అతడు గొడవ పడ్డాడని.. తమ వెహికల్‌పై రాళ్లతో దాడిచేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ లో సదరు పోలీసుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago