దేశంలో ఎటు చూసినా హత్యలు, అత్యాచారాలే కనపడున్నాయి. అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు మధ్య కూడా వివాహేతర సంబంధాల వల్ల వాళ్లను నమ్ముకున్న వారు రోడ్డున పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా ఓ ఘటన వింటే.. వేడెవడండి బాబు అంటూ ముక్కున వేలేసుకుంటారు. భార్య కాపురానికి రావడం లేదని కోపంతో భార్య ముక్కు కొరికాడు.
ఈ మధ్య మరో ఘటనలో భార్య స్నానం చేయలేదని విడాకులు అడిగాడట. ఇటువంటి చిన్న చిన్న కారణాలతో నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రత్లాం జిల్లాలో ఓ గ్రామంలో దినేశ్, టీనాలకు 2008లో వివాహం అయింది.
అప్పటి నుంచి వారు ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. వాళ్లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజుల నుంచి అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. అప్పటి నుంచి అతడు భార్యను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. ఇలా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ఆమె తన పుట్టింటికి వెల్లిపోయింది. అక్కడ వంట పని చేసుకుంటూ ఉండగా.. 2019లో ఆమె తన భర్త నుంచి మెయింటెన్స్ కోరుతూ కోర్టులో కేసు దాఖలు చేసిది.
దినేశ్ ఇటీవల భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి భార్యాబిడ్డల నిర్వహణ విషయంపై చర్చించగా, భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో, దినేశ్ తన కుమార్తెల ముందే.. టీనాపై దాడి చేసి ఆమె ముక్కును కొరికేసి అక్కడ నుంచి పారిపోయాడు. టీనాకు తీవ్ర రక్త స్రావం కావడంతో ఇరుగుపొరుగు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…