Singer Kousalya: కోవిడ్ బారినపడ్డ సింగర్ కౌసల్య.. బెడ్ మీదనుంచి లేవలేని పరిస్థితిలో..

Singer Kousalya: కరోనా మహమ్మారి చిత్రపరిశ్రమను నీడలా వెంటాడుతుంది.ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి రోజూ ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ఈ వైరస్ తో పోరాడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.

తాజాగా సింగర్ కౌసల్య సైతం కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలిపారు.ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రెండు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాను అని తెలిపారు.

ఈ వైరస్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయని, రెండు రోజుల నుంచి బెడ్ పై నుంచి పైకి లేవలేక పోతున్నాను అంటూ ఈమె తెలియజేశారు. జ్వరంతో పాటు గొంతునొప్పి కూడా తీవ్రంగా ఉందని నిన్నటి నుంచి మందులు వాడటం కూడా మొదలు పెట్టానని తెలిపారు.

త్వరలోనే మీ ముందుకు వస్తా…

ఈ వైరస్ తో పోరాడి ఆరోగ్యవంతంగా తిరిగి త్వరలోనే మీ ముందుకు వస్తాననీ దయచేసి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాలను తెలియ చేశారు.ఇక ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది ప్రముఖులు ఈమెకు జాగ్రత్తలు చెప్పడమే కాకుండా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.