Singer Mangli : వివాదంలో సింగర్ మంగ్లీ కొత్త పాట… గుడిలో పర్మిషన్ ఎవరిచ్చారంటూ…!

Singer Mangli : తెలంగాణ యాసతో పాటలు పాడుతూ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్. ఈమె అటు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పాడుతూనే మరోవైపు తెలంగాణ పల్లెపాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అనంతపురం జిల్లా గుత్తి దగ్గర బసినేపల్లి తాండాకు చెందిన సత్యవతి తెలంగాణ యాస పాటలతో న్యూస్ ఛానెల్స్ లో మంగ్లీ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, కన్నడ భాషాల్లో పాటలు పడుతూ ఫేమస్ అయిన మంగ్లీ ప్రైవేట్ ఆల్బమ్స్ తోనూ బాగా ప్రాచుర్యం పొందింది.

శ్రీకాళహస్తి టెంపుల్ లో సాంగ్ చేసిన మంగ్లీ…

శివరాత్రి సందర్బంగా సింగర్ మంగ్లీ ‘భం భం బోలే’ అంటూ శివుడికి సంబందించిన పాటను విడుదల చేసింది. అయితే పాట అందరికీ నచ్చినా ఆ పాటలు శ్రీకాళహస్తి దేవస్థానం లో తీయడమే కొందరికి అభ్యంతరకరం అయింది. అక్కడ వీడియో షూట్ చేయడానికి అనుమతి చాలా ఏళ్ల క్రితమే లేదంటూ, అలా నిబంధన చేయగా సింగర్ మంగ్లీకి ఎలా అనుమతి ఇచ్చారంటూ కొంతమంది పండితులు శ్రీకాళహస్తి వాసులు ప్రశ్నిస్తున్నారు.

కాలభైరవ మంటపం, అమ్మవారి సన్నిధి, స్పటిక లింగం వద్ద మంగ్లీ పాటను షూట్ చేసారు. అలా మంగ్లీ అండ్ టీం ను షూట్ చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆలయ అధికారులు అనుమతితోనే షూట్ చేసారని చెబుతున్నా అనుమతి ఎవరిచ్చారు అన్నది మాత్రం బయటపెట్టడం లేదు