Singer Rahul Sipliganj ఆస్కార్ ప్రకటించాక అందరూ ఏడ్చేశారు… చరణ్ ఎన్టీఆర్ తో సహా… పోలీసులు నా లగేజ్ మోస్తూ ఇంటికి తీసుకోచ్చారు…: సింగర్ రాహుల్ సిప్లిగంజ్

Singer Rahul Sipliganj : తెలంగాణ హైదరాబాద్ కు చెందిన రాహుల్ సిప్లిగంజ్ తన యూట్యూబ్ ఛానెల్ లో సొంతంగా ఆల్బమ్స్ చేసి పెడుతూ పేరు తెచ్చుకున్నాడు. అలా మగజాతి, మంగమ్మ, మైసమ్మ వంటి ఆల్బమ్స్ తో ఫేమస్ అయిన రాహుల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘జోష్’ సినిమాలో మొదటిసారిగా పాట పాడిన రాహుల్ ఆ తరువాత ‘దమ్ము’ సినిమాలో వాస్తు బాగుందే పాటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ కి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు వచ్చిన పాట ‘రంగస్థలం’ సినిమాలో పడిన ‘రంగ రంగ రంగస్థలాన’ పాట. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో సింగర్ కాలభైరవ తో కలిసి పాడిన ‘నాటు నాటు’ పాటకు అంతర్జాతీయంగా గుర్తింపుతో పాటు ఏకంగా మొదటిసారిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఒక భారతీయ గీతానికి తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డు రావడంతో కెరీర్ లో మంచి సక్సెస్ చూస్తున్న రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డు రావడం గురించి ఆ మధురానుభూతులను పంచుకున్నారు.

అందరం ఎమోషనల్ అయ్యాము…

అంతర్జాతీయ వేదిక మీద రాహుల్ సిప్లిగంజ్ అలాగే కార్తికేయ నాటు నాటు పాట పాడి వినిపించడం ఇవన్నీ ఒక తెలుగు కళాకారులకు దక్కిన అరుదైన గౌరవాలు కాగా ఈ విషయం గురించి రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ఆస్కార్ వరకు వెళ్తామని అసలు నేనెపుడు ఊహించలేదు. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ అంటూ మాట్లాడాడు. ఇక ఆస్కార్ అవార్డు వేడుకల్లో చాలా టెన్షన్ పడ్డాము. చరణ్, ఎన్టీఆర్, కార్తికేయ, నేను ఒక లైన్ కూర్చుని ఉండగా వెనక రాజమౌళి గారు ఆయన భార్య పిల్లలు కూర్చున్నారు. నామినీస్ లో చంద్రబోస్ గారు ఆయన కొడుకు, కీరవాణి గారు వాళ్ళ మేడం కూర్చున్నారు. అందరం ఉత్కంఠగా ఎదురుచూశాం. ఒక్కసారిగా ఆర్ఆర్ఆర్ అని పేరు వినగానే అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందరం ఎమోషనల్ అయిపోయాము అంటూ చెప్పారు.

దేశానికి గర్వకారణం అయిన విషయం కావడం ఆందులో నేను భాగస్వామిని అవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇందుకు కారణం కీరవాణి గారు రాజమౌళి గారే అంటూ రాహుల్ తెలిపారు. ఇక అమెరికా నుండి హైదరాబాద్ తిరిగి వచ్చినపుడు దూల్ పేట్ నుండి చాలా మంది నాకు స్వాగతం పలకడానికి వచ్చారు. దేంతో పోలీసుల బందోబస్తు నడుమ నేను ఇంటికి వెళ్లాను. పోలీసులే నాకు లగేజ్ ఇంటికి తెచ్చిచ్చారు. ఇక చాలా మంది నుండి కాల్స్ వస్తున్నాయి, అనుష్క శర్మ గారు విరాట్ కోహ్లీ వంటి వారు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడం బాగా అనియించింద అంటూ తన ఆనందాన్ని ఇంటర్వ్యూలో పంచుకున్నారు రాహుల్ సిప్లిగంజ్.