రాజమౌళి డైరెక్టర్ అవ్వడానికి ముందు నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు.. ఇప్పుడు దూరం అవ్వడానికి కారణం : ఎం.ఎం శ్రీలేఖ

ఎం. ఎం శ్రీలేఖ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్లేబ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈమె ఎం.ఎం.కీరవాణికి సిస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఒకే ఒక్క లేడి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం.ఎం శ్రీలేఖ పేరు సంపాదించుకున్నారు. ఈమె తన 12 సంవత్సరాల వయసులోనే ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

అప్పటికే ఎం.ఎం.కీరవాణి సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఉండగా అతని సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముందు సింగర్ గా, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిన శ్రీలేఖ పెళ్లి తర్వాత ఒక బాబుకు జన్మనివ్వడం తో ఒక రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయని త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీలేఖ వెల్లడించారు. ఈమె మొట్టమొదటిగా సంగీత దర్శకురాలిగా తాజ్ మహల్ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా సంగీత దర్శకురాలిగా పని చేశారు.

ఇంటర్వ్యూ సందర్భంగా ఎం. ఎం శ్రీలేఖ.. రాజమౌళితో ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. రాజమౌళి డైరెక్టర్ కాకముందు నుంచి తనకు ఎంతో క్లోజ్ అని, తనకు ఆల్బమ్స్, చాక్లెట్స్ బాగా కొనిచ్చేవాడని తెలిపారు. అయితే ప్రస్తుతం తను డైరెక్టర్ గా మారిన తర్వాత వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉండటం చేత ప్రస్తుతం తను దూరం అయ్యాడని ఈ సందర్భంగా శ్రీలేఖ రాజమౌళితో తనకున్న అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.