Singer Smitha : నాకు నా భర్తకు గొడవలు అవే… నా భర్త ఎవరంటే… ఏం చేస్తారంటే…: సింగర్ స్మిత

Singer Smitha : తెలుగులో మొట్ట మొదటి తెలుగు పాప్ గాయనిగా తన కెరీర్ ప్రారంభించింది స్మిత., ఈటీవీ లో పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా కెమరా ముందుకు వచ్చింది. 2000 సంవత్సరంలో పాప్ గాయనిగా ‘హై రబ్బా’ ఆల్బమ్ తో మంచి విజయాన్ని అందుకుంది. తరువాత వెను దిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్ళింది. గాయని గానే కాకుండా మల్లీశ్వరి, ఆట సినిమాలలో నటించింది స్మిత. తెలుగు సినిమాలలో ప్లే బ్యాక్ సింగర్ గానే కాకుండా స్మిత వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇషా సంస్థలో వాలంటీర్ గా సేవలు అందిస్తోంది. మరోవైపు ఈ మధ్యనే మరోసారి టాక్ షోతో సందడి చేస్తోంది.

భర్త తో అందుకే గొడవలు…

స్మిత చిన్న వయసులోనే పాప్ సింగర్ గా ఎదిగి ఆ పైన ప్లే బ్యాక్ సింగర్ గా ఎన్నో పాటలను పాడారు. అవే కాకుండా సొంత వ్యాపారంలోనూ ఉన్న స్మిత తన వ్యక్తిగత జీవితం, భర్త, పాప గురించి రిసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. భర్త శశాంక్ తో తన వివాహం గురించి మాట్లాడుతూ తమది ప్రేమ వివాహం అని అయితే మొదట ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు అనేది మాకు తెలియదని, అందరం ఫ్రెండ్స్ తనని బావ అని పిలిచేవాళ్లం అంటూ చెప్పారు.

తన ఫ్రెండ్ బావ అవడం వల్ల మొత్తం ఫ్రెండ్స్ అంతా అలానే పిలుస్తామని, ఇప్పటికీ అలానే బావ అని పిలుస్తున్నట్లు తెలిపారు. ఇక తాను వ్యాపారం చేసుకుంటున్న తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని నేను పాడుతుంటే ఇంకా ఇష్టం అంటూ స్మిత తెలిపారు. తన వ్యాపార విషయాల్లో నేను వేలు పెట్టను అలానే తాను నా కెరీర్ విషయంలో వేలు పెట్టడు. ఒకవేళ అలా ఎపుడైనా జోక్యం చేసుకుంటే మాత్రం గొడవ జరుగుతుంది అంటూ తెలిపారు.