Heroine Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. మొదట సొంత భాషలో ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఛలో సినిమాతో పరిచయమయ్యింది. ఇక ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పైగా తొలిచూపులతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో కూడా మరింత బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఆ సమయంలో అందరి మదిలో నేషనల్ క్రష్ గా కూడా నిలిచింది. మంచి అభిమానాన్ని సంపాదించుకుంది. అప్పటినుంచి వెను తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది. పైగా పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఈ బ్యూటీ క్రేజ్ సంపాదించుకుంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
పుష్ప సినిమాతో ఈ అమ్మడు అస్సలు ఆగటం లేదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ ఐదేళ్లలో ఈ బ్యూటీ ఎంత సంపాదించిందో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
ఇప్పటివరకు ఆమె ఐదు లక్షలు అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిందని తెలిసింది. హైదరాబాద్ లోనే కాకుండా గోవా, కూర్గ్, ముంబై, బెంగళూరు లో రూ.100కోట్ల పైన విలువ చేసే అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిందని తెలిసింది. అయితే ఇదంతా ఒక మీమ్ గా వైరల్ అవ్వగా.. వెంటనే రష్మిక దానికి స్పందించింది. ఇదంతా నిజమైతే బాగుండు అని ఆమె సమాధానం ఇవ్వడంతో.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని తెలిసింది. కానీ కొందరు మాత్రం నిజంగానే ఆస్తులు ఉన్నాయేమో అని అనుమానం పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…