Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ అనగానే తేడా మనిషి అనేవాళ్ళు ఉన్నారు, బతికితే ఆర్జివి లాగా బతకాలి అనుకునేవాళ్ళు ఉన్నారు. ఇండియాలో ఫ్రీడమ్ వచ్చిన ఏకైక వ్యక్తి కేవలం ఆర్జివి మాత్రమే అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తారు. నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చినట్టు ఉంటా అనేది ఆర్జివి తీరు. అయితే ఏదో ఒక ఒకవిషయంలో కాంట్రావెర్సీ క్రియేట్ చేసి తనని తాను ప్రమోట్ చేసుకుంటూ ఉండే ఆర్జీవి, సినిమాకు ప్రమోషన్స్ వింతగా చేసే ఆర్జీవి, తాను తీసిన సినిమాలను జనాలు ఎపుడో మర్చిపోయినా తాను చేసే, మాట్లాడే కాంట్రావెర్సీల కోసం మాత్రం ఎదురుచూస్తుంటారు. ఆర్జీవి తన హార్రర్ సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఒకప్పుడు మురళీ మోహన్ సినిమా చూసి భయపడిన సంగతి చెప్పారు.
జగమే మాయ సినిమా చూసి భయపడ్డాను…
రామ్ గోపాల్ వర్మ హార్రర్ సినిమాలైన దయ్యం, రాత్రి, మర్రి చెట్టు వంటి సినిమాలను తీసి జనాలను భయపెట్టాడు. అయితే రామ్ గోపాల్ వర్మ భయపడిన సినిమా ఏదో తెలుసా. ఏ హాలీవుడ్ మూవీనో అయ్యుంటుంది అనుకుంటే పొరపాటు. తాను స్కూల్ లో చదువునే వయసులో మురళీ మోహన్ గారు నటించిన ‘జగమే మాయ’ అనే సినిమా చూసి భయపడ్డాడట.
అదికూడా పగటి పూట ఇంటికి వెళ్ళడానికి.. అమీర్ పేట నుండి పంజాగుట్ట కి షార్ట్ కట్ రూట్ ఉన్నా కూడా భయమేసి మెయిన్ రోడ్డులో చుట్టూ తిరిగి ఇంటికి వెళ్ళేవాడట. ఈ విషయం ఇటీవల ఇంటర్వ్యూలో రామునే స్వయంగా తెలిపారు. అది చిన్నతనంలో కావడం వల్ల అలా భయపడ్డానంటూ చెప్పిన వర్మ హారర్ సినిమాలంటే చాలా ఇష్టమని, కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ ని భయపెట్టేవాడినంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…