Yandamuri Verendhranath : తెలుగులో నవలా రచయితగా ఎన్నో ఫేమస్ నవలలను రాసిన వ్యక్తి యండమూరి గారు. వెన్నెల్లో ఆడపిల్ల, రాక్షసుడు, మరణ మృదంగం, తులసీ దళం వంటి ఎన్నో నవలను రాసిన ఆయన అప్పట్లో పాఠకులను ఆయన కలంతో ప్రభావితం చేశారు. ఆయన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చి హిట్ అందుకున్నాయి. ఇక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎన్నో ఉపన్యాసాలను ఆయన పలు విద్యాసంస్థల్లో ఇస్తూ ఎంతో మందిని ప్రభావతం చేశారు. ఇక సినిమాల్లో కథను అందించేవరకే నా పాత్ర ఇక సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పే యండమూరి గారు పలు అంశాల మీద తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
అదంతా మాఫియా లాంటిది… ఆ సినిమాలను చూడలేదు…
యండమూరి గారి నవలలు ఎన్నో సినిమాలుగాను వచ్చాయి. ఆయన నవలలు తెలుగులోనే కాకుండా తమిళంలోనూ బాగా ప్రాచుర్యం పొందాయి. తమిళంలో యద్దనపూడి సులోచన రాణి నవలలను కూడా యండమూరి పేరుతో అనువదించడం జరిగింది. దీని గురించి మాట్లాడుతూ యండమూరి గారు అందులో తన తప్పు లేదని క్లారిటీ ఇచ్చారు. తమిళంలో ఒక లేడీ రచయిత మూగ, చెవిటి ఆమె తన వద్దకు వచ్చి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఏదైనా హెల్ప్ చేయమని అడిగే సరికి రాయల్టీ లేకుండా తన నవలలను అనువదించి అమ్ముకోమని చెప్పాడట.
అలా ఆమె ఒక ఐదు లక్షల వరకు సంపాదించుకుని కూతుర్లకు పెళ్లిళ్లు వంటివి చేసిందట. అయితే ఆ తరువాత మిగిలిన రచయితల తెలుగు నవలలను కూడా అనువదించి వీరేంద్రనాథ్ పేరు మీద పబ్లిష్ చేసి వదలడం చేయడం వల్ల సమస్య వచ్చిందని, నేను యద్దనపూడి గారి జీవన తరంగాలు నవల నా పేరు మీద అనువదించి అచ్చేసినపుడే ఆమెకు వివరించి అదంతా మోసం అని చెప్పానని వివరించారు. ఇక తాను సినిమాలను చూడక చాలా కాలం అయిందని దాదాపు 40 ఏళ్లయిందంటూ చెప్పారు. మగధీర, బాహుబలి వంటి సినిమాలను కూడా నేనేం చూడలేదంటూ చెప్పారు. సినిమాలు నాకు ఆసక్తిని కలిగించవని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…