Singer Smitha : హీరో నాని మా ఫ్యామిలీనే… అల్లరి నరేష్ కూడా… మల్లీశ్వరి సినిమా చేసినపుడు చాలా చిరాగ్గా ఉండేది…: సింగర్ స్మిత

Singer Smitha : తెలుగులో మొట్ట మొదటి పాప్ గాయనిగా తన కెరీర్ ప్రారంభించిన స్మిత, ఈటీవీ లో పాడుతాతీయగా ప్రోగ్రాం ద్వారా కెమరా ముందుకు వచ్చింది. 2000 సంవత్సరంలో పాప్ గాయనిగా ‘హై రబ్బా’ ఆల్బమ్ తో మంచి విజయాన్ని అందుకుంది. తరువాత వెను దిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్ళింది. గాయనిగానే కాకుండా మల్లీశ్వరి, ఆట సినిమాలలో నటించింది స్మిత. తెలుగు సినిమాలలో ప్లే బ్యాక్ సింగర్ గానే కాకుండా స్మిత వ్యాపార రంగంలో కూడా రాణిస్తోంది. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇషా సంస్థలో వాలంటీర్ గా సేవలు అందిస్తోంది. మరోవైపు వ్యాపారవేత్తగాను దూసుకుపోతోంది స్మిత. హైదరాబాద్, విజయవాడలలో ఫిట్ నెస్ అలాగే బ్యూటీ సెలూన్ పెట్టి రన్ చేస్తున్నారు. అలాగే ఐ క్యాండీ అనే ప్రొడక్షన్ హౌస్ ద్వారా వివిధ ప్రోగ్రామ్స్ ను టీవీ లో నిర్మిస్తున్నారు స్మిత.

నాని, అల్లరి నరేష్ అలా ఫ్రెండ్స్…

పాప్ ఆల్బమ్స్ చేసే సమయంలోనే అల్లరి నరేష్ నేను ఫ్రెండ్స్ అంటూ స్మిత తెలిపారు. తాను సినిమాల్లోకి రాకముందే మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూ చెప్పారు. ఇక నాని ఇండస్ట్రీకి వచ్చాక పరిచయం అని అప్పటి నుండి ఇక ఫ్యామిలీ అందరూ కలవడం అలా అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటామంటూ చెప్పారు. నేను, స్వప్న విజయవాడ లో ఉనప్పటి నుండి ఫ్రెండ్ అంటూ చెప్పారు. ఇక నా పెళ్లి విషయంలో మా ఇంట్లో వాళ్లకు విషయం చెప్పి ఒప్పించింది నాగార్జున గారి అన్న వెంకట్ గారే, ఆయనే నా పేరెంట్స్ ను మా ఆయన పేరెంట్స్ ను పెళ్లికి ఒప్పించారంటూ తెలిపారు.

ఇక తాను సినిమాల్లో ఎందుకు నటించలేదనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ మల్లీశ్వరి సినిమాలో చేయకుండా ఉండాల్సింది అంటూ చెప్పారు. ఆ సినిమాలో చేసేటప్పుడే చాలా చిరాకుగా అనిపించింది ఎందుకు చేస్తున్నానా అని అయితే ఒప్పుకుని చేస్తున్నానని ఇక చేశాను. ఆ సినిమా తరువాతే ఇక ఇష్టమైనదే చేయాలి అనవసరంగా నచ్చంది చేయాకూడదని నిర్ణయించికున్నా అంటూ చెప్పారు.