Director Rajamouli: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మంచి పేరు సంపాదించుకుంది. దానికి కారణం రాజమౌళి అని చెప్పాలి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటివరకు మంచి మంచి సినిమాలను రూపొందించాడు. తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర ఇండస్ట్రీకి చెందిన వారిని కూడా ఫిదా చేశాడు. ఇక పాన్ ఇండియా ఆర్ఆర్ఆర్ సినిమాతో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిదా చేశాడు.
ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులు అందుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబల్ అవార్డుతో కూడా అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది. రాజమౌళి ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువతో రూపొందించి తీరును చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోయారు. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా గురించి మాట్లాడుకునే వాళ్లే. ఇక ఇతర ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్లు కూడా.. రాజమౌళి టాలెంట్ చూసి మురిసిపోయారు.
పాపులర్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ కూడా ఈ సినిమాతో పాటు రాజమౌళిని కూడా ప్రశంసించాడు. ఇక ఇదంతా పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించేలా చేశాడు. తాజాగా రాజమౌళి హాలీవుడ్ లెజెండరీ స్టీవెన్ స్పీల్ బర్గ్ తో వీడియో కాల్ లో మాట్లాడారు. ఇక ఆ లెజెండరీ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడారు. ఆ సినిమా గురించి ప్రశంసించాడు. ఆ సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని పొగుడుతూ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల గురించి గొప్పగా చెబుతూ పొగిడాడు.
అంతేకాకుండా తమ అభిరుచులతో పాటు మరిన్ని సినిమాల గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. దీంతో రాజమౌళి ఆయనతో మాట్లాడిన విషయాలు గురించి స్పందిస్తూ.. స్టీవెన్ స్పీల్ బర్గ్ ను కలవటం చాలా అద్భుతంగా ఉందని.. ఎగిరి గంతేయాలని ఉంది అని అన్నాడు. మొత్తానికి రాజమౌళి తన సినిమాతో టాలీవుడ్ ను మరో లెవెల్ లో పెట్టేసాడని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…