వీడియో వైరల్ :అమ్మాయిలకు ఎగరడానికి రెక్కలు ఇవ్వండి.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!

మన సమాజం రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరు మాత్రం ఎంతో అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ అమ్మాయిల పట్ల కొన్ని చోట్ల వివక్షత చూపుతూనే ఉన్నారు. అమ్మాయిలు కేవలం ఇంటి పని, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తున్నారు. అయితే ఈ అజ్ఞానం నుంచి బయటకు రావాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. యానిమేటెడ్‌ వీడియోలు, జీఐఎఫ్‌లతో కథలు చెప్పే బోహ్రా సిస్టర్స్‌కు సంబంధించిన వీడియోను మంత్రి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమ కూతురి పట్ల ఉన్న అవగాహనను మార్చుకోవాలని మంత్రి సూచించారు.

https://www.instagram.com/p/CQ-6weqnisZ/?utm_source=ig_web_copy_link

ఈ వీడియోలో ఒక అమ్మాయి ఏడుస్తూ చిరిగిన దుస్తులు ధరించి చేతిలో చీపురు పట్టుకొని ఉంటుంది. అయితే ఆ అమ్మాయికి చిరిగిన దుస్తులకు బదులుగా స్కూల్ యూనిఫామ్ ధరించగానే… ఆమె ముఖంలో ఆనందం ఉట్టిపడుతుంది.”మీ కుమార్తెలను ఎదగడానికి రెక్కలు ఇవ్వండి”అనే క్యాప్షన్ తో మంత్రి స్మృతి ఇరానీ షేర్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ ఇది చాలా మంచి సందేశం అని కామెంట్ చేయగా మరొక నెటిజన్ ఇది ఎంతో బాగుంది తక్షణమే మీ కూతుళ్లను కూడా బడిబాట పట్టించండి అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.