ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు హీరోలను బట్టి సినిమాలను చూడడం లేదు.అది కొత్త హీరో అయినా, చిన్న హీరో అయినా లేక పెద్ద హీరో అయిన సినిమాల్లో కంటెంట్ ఉంటే మాత్రం అలాంటి సినిమాలను ఎంతగానో ఆదరిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సైతం భారీగా మార్కెట్ చేస్తున్నాయి.డిజటల్ రైట్స్, శాటిలైట్, స్ట్రీమింగ్ హక్కులు పరంగా చిన్న సినిమాలు కూడా నిర్మాతలకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి.
తాజాగా ఈ జాబితాలో మరో యంగ్ హీరో సినిమా కూడా చేరిపోయింది. సుధీర్ బాబు హీరోగా కరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెటెస్ట్ మూవీ” శ్రీదేవి సోడా సెంటర్”. ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా విడుదల కాకముందే నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెడుతుందని తెలుస్తోంది.
శ్రీదేవి సోడా సెంటర్ శాటిలైట్, డిజిటల్ హక్కులను జీ టీవీ గ్రూప్స్ తొమ్మిది కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి నిర్మాతలు తిరిగి పొందారని సమాచారం వినబడుతుంది. ఇప్పటికే “పలాస” సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కరణ్ కుమార్ జాబితాలో మరొక సూపర్ హిట్ సినిమా” శ్రీదేవి సోడా సెంటర్” అవుతుందని చెప్పవచ్చు. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా మణి శర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…