మన సమాజం రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరు మాత్రం ఎంతో అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ అమ్మాయిల పట్ల కొన్ని చోట్ల వివక్షత చూపుతూనే ఉన్నారు. అమ్మాయిలు కేవలం ఇంటి పని, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తున్నారు. అయితే ఈ అజ్ఞానం నుంచి బయటకు రావాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. యానిమేటెడ్ వీడియోలు, జీఐఎఫ్‌లతో కథలు చెప్పే బోహ్రా సిస్టర్స్‌కు సంబంధించిన వీడియోను మంత్రి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమ కూతురి పట్ల ఉన్న అవగాహనను మార్చుకోవాలని మంత్రి సూచించారు.
https://www.instagram.com/p/CQ-6weqnisZ/?utm_source=ig_web_copy_link
ఈ వీడియోలో ఒక అమ్మాయి ఏడుస్తూ చిరిగిన దుస్తులు ధరించి చేతిలో చీపురు పట్టుకొని ఉంటుంది. అయితే ఆ అమ్మాయికి చిరిగిన దుస్తులకు బదులుగా స్కూల్ యూనిఫామ్ ధరించగానే… ఆమె ముఖంలో ఆనందం ఉట్టిపడుతుంది.”మీ కుమార్తెలను ఎదగడానికి రెక్కలు ఇవ్వండి”అనే క్యాప్షన్ తో మంత్రి స్మృతి ఇరానీ షేర్ చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ ఇది చాలా మంచి సందేశం అని కామెంట్ చేయగా మరొక నెటిజన్ ఇది ఎంతో బాగుంది తక్షణమే మీ కూతుళ్లను కూడా బడిబాట పట్టించండి అంటూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…