లేడీ ఓరియంటెడ్ మూవీ ఒసేయ్ రాములమ్మ తర్వాత అరుంధతి మూవీ వచ్చేవరకు మరో సక్సెస్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమా రాలేదు. ఒకవేళ వచ్చినా అంతగా విజయాన్ని సాధించలేదు. అమ్మోరు సినిమా తర్వాత వచ్చిన అంజి సినిమాకు గ్రాఫిక్స్ విభాగములో శ్యాం ప్రసాద్ రెడ్డి కి నేషనల్ అవార్డు వచ్చింది. సినిమా ఫెయిల్ అయిన నేషనల్ అవార్డు రావడంతో శ్యాం ప్రసాద్ రెడ్డి పడిలేచిన కెరటంలా అరుంధతి మూవీ తో బాక్సాఫీస్ పై తిరగబడ్డారు.
శ్యాం ప్రసాద్ రెడ్డి దూరపు బంధువు గద్వాల్ వచ్చినప్పుడు గద్వాల్ చరిత్ర గురించి చెప్పేది ఇది కథలో ప్రధానమైన అంశం కానప్పటికీ మూలాధారంగా మాత్రం నిలిచింది. చిన్నప్పుడు శ్యాం ప్రసాద్ రెడ్డి నానమ్మ గారు చెప్పిన జానపద కథలు గుర్తుకొచ్చి అలాంటి నేపథ్యం తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. తన రైటర్స్ ని పిలిచి అలాంటి మూల అంశంతో ఒక కథను పూర్తిగా సిద్ధం చేయించారు. ఆ కథకి అరుంధతి అనే టైటిల్ పెట్టారు.
అరుంధతి సినిమాలో విలన్ పాత్ర కి తమిళ నటుడు పశుపతిని అనుకున్నారు. కానీ ఆయన అంత అగ్రెసివ్ గా కనిపించకపోవడంతో ఆ పాత్ర కాస్తా సోనూసూద్ కు వెళ్ళింది. మరో ముఖ్య పాత్ర ఫకీర్ ముందుగా నానాపటేకర్ అనుకున్నారు కానీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ క్యారెక్టర్ శాయాజీ షిండే కి వెళ్ళింది. దర్శకుడిగా తమిళ డైరెక్టర్ సభాపతిని అనుకొని కొంత షూట్ చేసిన తర్వాత శ్యాం ప్రసాద్ రెడ్డి కి నచ్చకపోవడంతో అతని తొలగించి ఆ అవకాశం తన ఆస్థాన దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గరికి వెళ్ళింది.
ఇక ఇందులో అతి ముఖ్యమైన అరుంధతి పాత్ర ఒడ్డు పొడుగు అందంగా ఉండే అమ్మాయి కావాలి ముందుగా యమదొంగలో రెండో హీరోయిన్ గా చేసిన మమతా మోహన్ దాస్ అనుకున్నారు. కానీ ఆమెకు ఎవరో శ్యాం ప్రసాద్ రెడ్డి తో సినిమా అంటే దాదాపు 2,3 సంవత్సరాల సమయం తీసుకుంటుంది నీ కేరీర్ స్పాయిల్ అవుతుంది అన్నారు. దానితో ఆమె తప్పుకోగా ఆ అవకాశం అనుష్క దక్కించుకుంది. అనుష్క జేజమ్మ పాత్రలో తెలుగు ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకోవడం జరిగింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…