Featured

సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా?

తెలుగు చలన చిత్ర సీమలో తనదైన నటనా ప్రతిభతో అతి తక్కువ టైం లోనే సక్సెస్ అందుకున్నారు సీనియర్ నటుడు సుధాకర్. బి. సుధాకర్ అంటే అందరికీ తెలియక పోవచ్చు కానీ, పిచ్చకొట్టుడు సుధాకర్ అంటే మాత్రం ప్రతి ఒక్కరికి గుర్తే. సూర్య వంశం, శుభాకాంక్షలు, అల్లుడు గారు, సుస్వాగతం వంటి 600 సినిమాల్లో నటించి నవ్వించిన ఇతను అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. ఈయన తెలుగువాడే అయినప్పటికీ తన సినిమా కెరీర్ ప్రారంభంలో కోలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోగా తన ప్రతిభను చూపించాడు.

ఆ తరువాత మాతృభాష అయిన తెలుగులో హీరోగా నిలదొక్కుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసాడు. కానీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించక పోవడంతో రూటు మార్చి క్యారెక్టర్ యాక్టర్ గానూ, విలన్ గానూ, కమెడియన్ గానూ, ఈ విధంగా విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సుధాకర్ చేసిన ప్రతీ క్యారెక్టర్లోనూ తనదైన నటనతో మంచి మార్కులు సంపాదించి ప్రేక్షకుల ఆదరణను పొందాడు. సుధాకర్ తన సినీ ప్రస్థానంలో ఎన్ని విభిన్నమైన పాత్రలను పోషించిన్నప్పటికీ చివరకు ఆయనకు హాస్యనటుడిగానే మంచి గుర్తింపు లభించింది. సుధాకర్ కామెడీ పాత్రలలో నటించిన ఎన్నో చిత్రాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. నటునిగానే కాకుండా నిర్మాతగానూ సుధాకర్ కొన్ని చిత్రాలను నిర్మించాడు. అందులో ఆయనకు సంతృప్తిని కలిగించిన చిత్రం చిరంజీవి హీరోగా నిర్మించిన ‘యముడికి మొగుడు’. సుధాకర్ తన నటనా జీవితంలో అరుదైన ప్రతిభను కనపరిచి ఎన్నో అవార్డులు, రివార్డులను కూడా అందుకున్నారు.

సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపూర్. చెన్నైలోని ఓ ఫిలిం ఇంస్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకుని, తమిళ సినిమాల్లో అడుగు పెట్టారు. తమిళంలో హీరోగా 35 సినిమాలు చేశారు. ఆ చిత్రాలన్నీ విజయం సాధించాయి. వాటిల్లో ఏడాది పాటు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ప్రముఖ నటి రాధికతో కలిసి 13 చిత్రాల్లో నటించారు సుధాకర్. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఆరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ రూమ్ మేట్స్. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే చిరంజీవి హీరోగా యముడికి మొగుడు చిత్రాన్ని నిర్మించారు సుధాకర్. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్న కొంతకాలానికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు సుధాకర్. పెళ్లి అయినా పదేళ్లకు సుధాకర్ దంపతులకు బెనటిక్ మైఖేల్ (బెన్నీ) అనే కొడుకు పుట్టాడు. ప్రస్తుతం అతను ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తమిళ చిత్రాలు చేసేటప్పుడు అనేక అవార్డులు, బిరుదులు అందుకున్న సుధాకర్ పెద్దరికం, స్నేహితులు అనే 2 సినిమాలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. సుధాకర్ ముక్కు సూటిగా ఉంటారు. షూటింగ్ కాగానే ఇంట్లో వాలిపోతారు. అలాగే సినీ ప్రముఖులతో కూడా అనుబంధం చాలా తక్కువ. సుధాకర్ కు తనికెళ్ల భరణి, జేడీ చక్రవర్తి మంచి స్నేహితులు. సుధాకర్ హీరో, కమెడియన్ గానే కాదు కింగ్ నాగార్జున “మజ్ను” సినిమాలో విలన్ గా నటించి తన విలనిజం తో మెప్పించారు.

ఒకసారి మన సీనియర్ నటుడు సుధాకర్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురయింది. అయితే అందులో ప్రయాణికులందరూ సురక్షితంగానే బయటపడ్డారు. అయినా ఆ తర్వాత సుధాకర్ విమాన ప్రయాణం భయంతో కొంత కాలంగా విమానమే ఎక్కలేదు. ఈమధ్య కాలంలో ప్రముఖ దర్శకులు రాజమౌళి దర్శకత్వం వహించిన శాంతినివాసం సీరియల్ లో సుధాకర్ నటించారు. tv5 లో “రాజకీయ భేతాళం” అనే ప్రత్యేక షోలో కూడా నటించారు. మళ్లీ పదేళ్ల తర్వాత మొహానికి మేకప్ వేసుకుంటున్న సుధాకర్ లేటెస్ట్ గా సాయి రామ్ శంకర్ హీరో గా నటిస్తున్న “వాడు నేను కాదు”లో ఓ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ చిత్రం ద్వారా మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తాను అని చెబుతున్న సుధాకర్ గురించి కొడుకు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

సుధాకర్ కుమారుడు మైకేల్ బెన్నీని ప్రత్యక్షంగా చూసిన ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ అయ్యిపోద్ది. ఎందుకంటే మైకేల్ బెన్నీఅందం ముందు మన టాలీవుడ్ హీరోలు కూడా ఎందుకూ పనికి రారాన్నంతా సూపర్ గా ఉంటాదనడానికి నిదర్శనంగా ఈమధ్యనే సుధాకర్ కొడుకు మైకేల్ బెన్నీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మొదటి నుండి మైకేల్ బెన్నీకి నటన అంటే అసలు ఆసక్తి ఉండేది కాదు. కానీ., విశేషమేమిటంటే.. మైకేల్ బెన్నీవిద్యారంగంలో బాగా రాణించాడు. మైకేల్ బెన్నీ ఇంజనీరింగ్ చదువుతున్నపుడు యూనివర్సిటీ కే ఫస్ట్ రాంక్ సాధించాడు. ప్రస్తుతం ఓ మల్టీ నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా రాణిస్తున్న మైకేల్ బెన్నీ జీతం ఎంతో తెలుసా.? నెలకు లక్షల్లోనే అంటే ఆశ్చర్యం కలుగకమానదు. తాజాగా మైకేల్ బెన్నీ కొన్ని ఇంటర్వూస్ లో కూడా పాల్గొన్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

59 minutes ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

1 hour ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

1 hour ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

1 hour ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

1 hour ago

బాలకృష్ణతో మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు? విజయశాంతి షాకింగ్ రివీల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

2 hours ago