Featured

సుమంత్ స్టార్ హీరోగా ఎందుకు ఎదగలేకపోయాడో తెలుసా.? అసలు ఆ తప్పు చేయకుండా ఉంటే..

ప్రతి మనిషి లైఫ్ లోనూ ఒప్పులతో పాటు కొన్ని తప్పులు చేస్తుంటారు. సరిగ్గా అలాంటి తప్పులని తన సినిమా లైఫ్ లో చేసానని.. అదే హీరోగా తన కెరీర్‌కు అవరోధంగా మారాయని తెలియజేస్తున్నాడు హీరో సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు మనవడుగా, నాగార్జున మేనల్లుడుగా, నిర్మాత యార్లగడ్డ వారి కొడుకుగా సుమంత్ కి చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది. టాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు సుమంత్.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మధ్యలో సుమంత్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఫ్లాపు కావడంతో అనుకున్నంత స్థాయికి ఎదగలేకపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమంత్ ఇవే విషయాలను మాట్లాడుతూ.. తన సినీ కెరీర్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను వివరించాడు. అక్కినేని నటవారసుడిగా సుమంత్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి కొన్ని మంచి సినిమాలతో అలరించినప్పటికీ సుమంత్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచి నటనా చాతుర్యం ఉంది. అయినా తేడా కొట్టింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలకు ధీటుగా రాణించాల్సిన సుమంత్ సినిమా కెరీర్ దెబ్బ తినడానికిగల కారణాలు విశ్లేషిస్తే…

చిన్నప్పటినుంచి నటన మీద ఆసక్తి గల సుమంత్ ఫిలిం కోర్సు కూడా నేర్చుకున్నాడు. 1997నుంచి హీరోగా ఎంట్రీ ఇప్పించాలని నాగ్ చేసిన ప్రయత్నం 1999లో ఫలించింది.వివరాల్లోకి వెళ్తే.. 1999 లో రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ప్రేమ కథ’ చిత్రంతో సుమంత్ హీరోగా పరిచయమయ్యాడు. తన మేనమామ నాగార్జునే ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం ఖచ్చితంగా సుమంత్ కు మంచి విజయాన్ని అందించి.. పెద్ద హీరో అవ్వడానికి ఉపయోగపడుతుంది అని అప్పట్లో అందరూ అనుకున్నారట. కానీ కట్ చేస్తే ‘ప్రేమకథ’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ప్రారంభం నుండీ చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోనే సాగుతుంది. కొంతమందికి ఈ చిత్రం చాలా బాగా నచ్చిందనే కామెంట్స్ కూడా వచ్చాయి.

అయినా సరే ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. దీనికి కారణం ఏమిటని సుమంత్ నే అడిగితే సుమంత్ మాట్లాడుతూ.. ” ‘ప్రేమకథ’ చిత్రం ఫ్లాప్ అవ్వడానికి మా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రత్యక్షంగా ఓ కారణం అయితే… పరోక్షంగా ‘టైటానిక్’ హాలీవుడ్ మూవీ ఒక కారణం అని చెప్పాడు. ఏంటి.. వినడానికి వింతగా ఉన్న ఇది నిజమండీ.. ‘ప్రేమకథ’ సినిమా క్లయిమాక్స్ లో హీరో, హీరోయిన్లు చనిపోతారు. ‘అలా పెట్టొద్దు.. సినిమా ఫ్లాప్ అయిపోద్ది’ అని డైరెక్టర్ కి ముందే చెప్పాను. కానీ అతను వింటే కదా..! ‘టైటానిక్’ సినిమా క్లయిమాక్స్ చూసినప్పుడు అతనికి చాలా ఏడ్పు వచ్చిందట. హీరోయిన్ మాత్రం బ్రతికి ఉండడం తనకి నచ్చలేదట. అందుకని నా సినిమాలో హీరో, హీరోయిన్స్ ఇద్దరినీ చంపేశాడు. అందుకే ‘ప్రేమకథ’ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత చాలా కేర్ తో చేసిన “యువకుడు” మూవీ ఏవరేజ్ గా ఆడింది.” అంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు.

అలాగే తన తాత అక్కినేని నాగేశ్వరరావు, మేనమామ నాగార్జునతో చేసిన సినిమాలు చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ షాక్ ఇచ్చాడు. చిన మేనమామ నాగార్జునతో కలిసి ‘స్నేహమంటే ఇదేరా’ సినిమా చేయడం తన సినీ జీవితంలో చేసిన మొదటి పెద్ద తప్పు అని 2001లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అవుంతుందని .. తనకు ముందే తెలుసన్నారు. ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని షూటింగ్ టైంలోనే అనిపించింది. కానీ ఏమి చేయలేకపోయాను. ఈ చిత్రంలో నిజ జీవితంలో మామ అల్లుళ్లమైన మేమిద్దరం ఫ్రెండ్స్ గా నటించడాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదన్నారు. అంతేకాదు తెలుగులో ఈ స్క్రిప్ట్ అంతగా గొప్పగా వర్కౌట్ కాలేదన్నారు. ‘స్నేహమంటే ఇదేరా’ చిత్రం మలయాళంలో హిట్టైన ‘ఫ్రెండ్స్’ సినిమాకు రీమేక్. ఈ సినిమా ఆ తర్వాత తమిళంలో సూర్య, విజయ్ హీరోలుగా మలయాళ వెర్షన్‌ డైరెక్ట్ చేసిన సిద్దిక్ అదే ‘ఫ్రెండ్స్’ టైటిల్‌తో రీమేక్ చేసాడు. ఈ చిత్రం అక్కడ కూడా సూపర్ హిట్టైంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమాలో ఫ్రెండ్స్ గా మా ఇద్దరి బంధాన్ని ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. ఆ విషయం తనకు షూటింగ్ చేస్తున్న టైంలో అర్ధమైంది. కానీ బయటకు మాత్రం చెప్పలేకపోయాను.

ఇక మావయ్య నాగార్జునతో 2 సూపర్ హిట్స్ ఇచ్చిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్లు ఈ సినిమా నిర్మించడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానన్నారు. ఈ చిత్రంలో అల్లుడైన నేను నాకు మేనమామ అయిన నాగార్జునను కొట్టే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశం తీసేటపుడు నేను ఎంతో బాధపడ్డాను. ప్రేక్షకులు కూడా ఆ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోయారని చెప్పుకొచ్చారు. అందుకే ఈ సినిమా చేయడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పుగా భావిస్తాను. ఈవిధంగా ఒక్క మేనమామ నాగార్జునతో కాదు..తాతయ్య నాగేశ్వరరావుతో ‘పెళ్లి సంబంధం’ సినిమా చేశానన్నారు. రాఘవేంద్రరావు బలవంతం చేయడంతో ఈ సినిమా చేసానన్నారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిందని సుమంత్ చెప్పుకొచ్చారు. తాతయ్య, మామయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఆరాటంతో నేను చేసిన సినిమాలు ఇవి. ఈ చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్‌లు సరిగా లేకపోవడంతో పాటు.. మా అనుబంధం కారణంగా ఈ సినిమాలు పెద్దగా ఆడలేదని సుమంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే తన సినిమా కెరీర్ లో 20 మంచి సినిమా ఆఫర్లను వదిలేయడం సుమంత్ కి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

వాటిల్లో 5 చిత్రాలు బ్లాక్ బస్టర్. ముందుగా “తొలిప్రేమ” చిత్రంతో సుమంత్ ని టాలీవుడ్ కి పరిచయం చెయ్యాలని చూస్తే.. నాగ్ రిజెక్ట్ చేసాడు. కానీ., ఇదే మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ ని అనూహ్యంగా మార్చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన “నువ్వే కావాలి” చిత్రం ఆఫర్ వస్తే సుమంత్ ఒప్పుకోలేదు. అది కాస్త తరుణ్ కి వెళ్ళింది. ‘నువ్వొస్తావనీ’ మూవీ ఆఫర్ ని సుమంత్ వదిలెయ్యడంతో నాగ్ ఎంతో ఇష్టపడి ఆ చిత్రంలో నటించి హిట్ అందుకున్నాడు. ఇక క్లాసిక్ లవ్ స్టోరీ “మనసంతా నువ్వే” మూవీ ఆఫర్ ని కూడా సుమంత్ రిజెక్ట్ చేయడంతో ఉదయ్ కిరణ్ కి చేరింది. పూరి జగన్నాధ్ మొదటగా ‘ఇడియట్’ మూవీ ఆఫర్ ని సుమంత్ కె ఇచ్చాడంట. బాడ్ లక్ వలన సుమంత్ రిజెక్ట్ చేసాడు. ఈ సిన్మాలు సుమంత్ చేసి ఉంటే నిజంగానే సూపర్ స్టార్ అయ్యేవాడు. ఈమధ్యకాలంలో సుమంత్.. ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో తాత ఏఎన్నార్ పాత్రలో నటించడం విశేషం.

ఇలా వరుసగా 3 సినిమాలు హిట్ ఇవ్వలేదు. ఇక ముందే ఒప్పుకున్నారామ్మా చిలకమ్మా మూవీస్ ప్లాప్ కావ డంతో కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి రెండేళ్ల తర్వాత నాగ్ స్వయంగా నిర్మించిన “సత్యం” చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం సుమంత్ కి హీరోగా మంచి గుర్తింపు తెచ్చినా స్టార్ హోదా మాత్రం రాలేదు. ఆ తర్వాత విదుసూదలైన “గౌరీ” చిత్రం మాస్ లుక్ ఇవ్వగా, “గోదావరి” చిత్రం క్లాస్ లో ఇమేజ్ పెంచింది. అదేం చిత్రమో.. లేక సుమంత్ దురదృష్టమో కానీ 2011లో ‘గోల్కొండ హైస్కూల్’ మూవీ వరకూ ఒక్క హిట్ కూడా సుమంత్ ఖాతాలో పడలేదు. దగ్గరగా దూరంగా, మళ్ళీ రావా లాంటి మూవీస్ కమర్షియల్ గా సక్సెస్. తాజాగా “కపటధారి” మూవీతో సుమంత్ మనముందుకు వస్తున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago