Sobhan Babu: ఎన్టీఆర్ వదులుకున్న సినిమాను చేసిన శోభన్ బాబు.. ఫీలైన ఎన్టీఆర్?

Sobhan Babu:తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలైన నందమూరి తారకరామారావు కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలలోనైనా ఇట్టే ఇమిడిపోయే ఈ నటులు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.కేవలం కుటుంబ కథా చిత్రాలు ప్రేమకథా చిత్రాలు మాత్రమే కాకుండా పౌరాణిక చిత్రాలలో కూడా ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కూడా క్రమశిక్షణకు మారు పేరు అయితే ఇద్దరిలో ఒక్కటే తేడా ఉంది. ఎన్టీఆర్ నటించిన సినిమా ఏదైనా మంచి హిట్ అయితే ఆ సినిమా రాబట్టిన బడ్జెట్ అనుగుణంగా ఆయన తన తదుపరి సినిమాకు రెమ్యూనరేషన్ పెంచేవారు. ఈ క్రమంలోనే శోభన్ బాబు మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఏడాదికి ఒకసారి తన రెమ్యూనరేషన్ పెంచే వారట.

ఇలా ఇద్దరి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని గుమ్మడి వెంకటేశ్వరరావు చేదు జ్ఞాపకాలు అనే పుస్తకంలో రచించారు. ఈ క్రమంలోనే బాబు రమణలు ఇద్దరు కూడా ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని సంపూర్ణ రామాయణం సినిమాని ఎన్టీఆర్ కు వినిపించారట. ఎన్టీఆర్ ఈ సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో తనకు చెల్లించే రెమ్యూనరేషన్ తో ఈ సినిమా చేస్తామని భావించిన బాపు రమణలు ఈ సినిమాతో కృష్ణంరాజు వద్దకు వెళ్లారు.ఇక కృష్ణంరాజు అదే సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని శోభన్ బాబు దగ్గరికి తీసుకెళ్లారు.

Sobhan Babu: రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిన ఎన్టీఆర్..

ఇక ఈ సినిమాలో శోభన్ బాబు నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా అందుకున్న విజయాన్ని చూసిన అనంతరం ఎన్టీఆర్ ఈ సినిమాని వదులుకొని చాలా తప్పు చేస్తానని భావించారట అందుకే అప్పటినుంచి తన సినిమాల రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమాలు చేస్తూ వచ్చారు. ఇకపోతే బాపు రమణ గారి దర్శకత్వంలో చేయాలన్న కోరికతోనే ఈయన శ్రీనాథ అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆదరణ సంపాదించుకోలేకపోయింది.