Anjali: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవడం కోసం సెలబ్రిటీలు కొన్నిసార్లు తీసుకొనే నిర్ణయాలు వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.అదేవిధంగా మరికొన్నిసార్లు వారు తీసుకున్న నిర్ణయం వల్ల వారి కెరియర్ మొత్తం ఇబ్బందులలో పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు కొత్తదనం కోసం ప్రయత్నాలు చేస్తూ తమ కెరియర్ ను పూర్తిగా ఇబ్బందులలో పడేసుకున్న వారు ఉన్నారు.
తాజాగా ఇలాంటి కోవలోకి మరొక హీరోయిన్ కూడా చేరిపోయింది.తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్గా నటించిన తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అంజలి అచ్చ తెలుగు అమ్మాయిగా ఇక్కడ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన అంజలి అనంతరం అవకాశాలు లేకపోవడంతో ఐటమ్ సాంగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ విధంగా బోయపాటి అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు సినిమాలో ఈమె బ్లాక్ బాస్టర్ అనే ఐటమ్ సాంగ్ లో నటించారు. ఇకపోతే తాజాగా నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా ఈమె రారా రెడ్డి అనే మాస్ సాంగ్ తో దుమ్ము దులిపారు. ఇలా మాస్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే ఈమెకు ఇండస్ట్రీలో మరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నిర్మాతకు కృతజ్ఞతగా ఈమె మరొక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విధంగా ఈమె మరో ఐటమ్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంతోమంది ఈమె కేరియర్ పై స్పందిస్తూ అంజలి అవకాశాల కోసం ఇలా ఐటమ్ సాంగులలో చేస్తూ తప్పుటడుగులు వేస్తుందని ఈ చెత్త నిర్ణయం కారణంగా తన కెరియర్ మొత్తం ఇబ్బందులలోకి పడేసుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…